CM YS Jagan : కార్య‌క‌ర్త‌లే బ‌లం విజ‌యం త‌థ్యం – జ‌గ‌న్

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సిద్దం కావాలని పిలుపు

CM YS Jagan : రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే కార్య‌క‌ర్త‌లు సిద్దం కావాల‌ని పిలుపునిచ్చారు వైసీపీ శాశ్వ‌త అధ్య‌క్షుడు, ఏపీ సీఎం సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని వారు లేక పోతే పార్టీనే లేద‌న్నారు.

ఇక నుంచి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తి కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్య‌త కార్య‌క‌ర్త‌ల‌తో పాటు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, స‌ర్పంచ్ లు, ఎంపీపీలు, జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్లు, స‌హ‌కార సంఘాల చైర్మ‌న్లు, ఇత‌ర నాయ‌కుల‌పై ఉంద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(CM YS Jagan).

కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తే ఈసారి మొత్తం సీట్లు మ‌నం గెలుచు కోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు సీఎం. 18 లేదా 19 నెల‌ల త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని ఇప్ప‌టి నుంచే వాటి కోసం స‌న్న‌ద్ద‌మై ఉండాల‌న్నారు. త‌న క్యాంపు ఆఫీసులో క‌ర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ముచ్చ‌టించారు.

ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన ఇంటింటికీ ప్ర‌జ‌ల పాల‌న కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఆదేశించారు. ఏ ఒక్క‌రు కూడా స‌మ‌యాన్ని నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. ఇప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డితే ఆనాటికి అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోగ‌ల‌మ‌ని స్ప‌ష్టం చేశారు సందింటి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan).

ముఖ్య‌మంత్రిగా ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు వ్య‌క్తిగ‌తంగా అందుబాటులో ఉండ‌టం సాధ్యం కాద‌న్నారు. గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ కార్య‌క‌ర్త‌ల‌కు చేదోడు వాదోడుగా ఉండాల‌ని ఎమ్మెల్యేల‌కు సూచించారు సీఎం. ప్ర‌తి గ్రామంలో వారానికి మూడు రోజులు ప‌ర్య‌టించాల‌ని , క‌నీసం ఆరు గంట‌ల పాటు అక్క‌డే ఉండేలా ప్లాన్ చేసుకోవాల‌ని సూచించారు.

Also Read : బీజేపీలో మీ వారసుల చిట్టా విప్పండి

Leave A Reply

Your Email Id will not be published!