Hijab Row : ‘హిజాబ్’ పై రాజ్యాంగ ధ‌ర్మాస‌నం అవ‌స‌రం

సీజేఐకి ఆల్ ఇండియా బార్ అసోసియేష‌న్ లేఖ‌

Hijab Row :  దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం హిజాబ్(Hijab Row) ను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణ‌యం. దీనిపై క‌ర్ణాట‌క హైకోర్టు స‌రైన‌దేనంటూ స్ప‌ష్ట‌మైన తీర్పు ఇచ్చింది. దీనిని స‌వాల్ చేస్తూ ముస్లిం వ‌ర్గాలు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. విచార‌ణ చేప‌ట్టిన సుప్రీం ధ‌ర్మాస‌నం భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేసింది.

ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల మ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. జ‌స్టిస్ హేమంత్ గుప్తా హిజాబ్ పై నిషేధం స‌రైన‌దేనంటూ తీర్పు చెప్పారు. ఈ మేర‌కు క‌ర్ణాట‌క స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యానికి ఓకే చెప్పారు. ఇదిలా ఉండ‌గా ఇదే బెంచ్ లో ఉన్న మ‌రో న్యాయ‌మూర్తి ధూలియా మాత్రం కొట్టి పారేశారు.

చ‌దువుకునే అమ్మాయిల‌కు హిజాబ్ ఉండ‌డంలో త‌ప్పేంటి అని ప్ర‌శ్నించారు. ఆయ‌న పిటిష‌నర్ల‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది. దీంతో చివ‌ర‌కు అంతిమ తీర్పు భార‌త దేశ అత్యున్న‌త న్యాయ‌మూర్తి – సీజేఐకి బ‌దిలీ చేసింది ధ‌ర్మాస‌నం. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది దేశ వ్యాప్తంగా.

హిజాబ్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఏర్పాటు చేయాల‌ని న్యాయ‌వాదులు అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌తాన్ని ఆచ‌రించే హ‌క్కు, విద్యా సంస్థ‌ల‌కు యూనిఫాం నిర్ణ‌యించే హ‌క్కు అనే అంశంపై భిన్నాభిప్రాయం ఎందుకు ఉండాల‌న్నారు సీనియ‌ర్ న్యాయ‌వాది ఈతా లూత్రా.

ముస్లిం న్యాయ‌మూర్తితో స‌హా క‌నీసం ఐదుగురు న్యాయ‌మూర్తులతో ధ‌ర్మాస‌నం ఉండాల‌ని ఆల్ ఇండియా బార్ అసోసియేష‌న్ సీజేఐకి లేఖ రాసింది.  భార‌త దేశ పౌరులంద‌రికీ సంబంధించిన స‌మ‌స్య. హిజాబ్ అనేది ఉండాలా వ‌ద్దా అన్న చ‌ర్చ‌కు పుల్ స్టాప్ పెట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని పేర్కొన్నారు మ‌రో సీనియ‌ర్ న్యాయ‌వాది.

Also Read : రాచ‌రిక పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడండి

Leave A Reply

Your Email Id will not be published!