Kumara Swamy : హిందీని రుద్దితే ఇక యుద్ధ‌మే – కుమార‌

కేంద్ర స‌ర్కార్ తీరుపై మాజీ సీఎం క‌న్నెర్ర‌

Kumara Swamy : క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా నేతృత్వంలోని పార్ల‌మెంట‌రీ ప్యానెల్ క‌మిటీ హిందీని దేశ వ్యాప్తంగా రాజ భాష‌గా అమ‌లు చేయాల‌ని నివేదిక స‌మ‌ర్పించింది రాష్ట్ర‌ప‌తికి. దీనిపై దేశ మంత‌టా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

అక్టోబ‌ర్ 15 నుంచి పూర్తి స్థాయిలో నిర‌స‌నలు చేప‌ట్టాల‌ని పిలుపునిచ్చింది త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం. డీఎంకే చీఫ్‌, సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరిగారు ఇప్ప‌టికే. హిందీని బ‌ల‌వంతంగా రుద్దాల‌ని చూస్తే పుట్ట‌గ‌తులు ఉండ‌వంటూ హెచ్చ‌రించారు. ఆయ‌న వార్నింగ్ ఇచ్చిన కొన్ని గంట‌ల‌కే క‌న్న‌డ నాట తీవ్ర ప్ర‌భావం చూపే నాయ‌కుల‌లో ఒక‌రైన కుమార స్వామి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తాము హిందీ భాష‌ను ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేద‌ని తేల్చేశారు. హిందీని రుద్దాల‌ని కేంద్రం ప్ర‌య‌త్నం చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం కుట్ర‌ల్ని తిప్పి కొట్టేందుకు దక్షిణాది రాష్ట్రాల‌న్నీ పార్టీల‌కు అతీతంగా ఏకం కావాల‌ని పిలుపునిచ్చారు కుమార స్వామి(Kumara Swamy).

బెంగ‌ళూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అమిత్ షా దేశాన్ని ముక్క‌లు చేయాల‌ని చూస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ప్ర‌స్తుతం దేశం లో అన్ని కులాలు, మ‌తాలు, జాతుల‌కు చెందిన వారు క‌లిసి మెలిసి బ‌తుకుతున్నార‌ని వారిని విడ‌దీసే ప్ర‌య‌త్నంలో భాగంగానే కొత్త రాగం అందుకున్నారంటూ మండిప‌డ్డారు.

ఒకే దేశం ఒకే భాష ఒకే పార్టీ ఒకే మ‌తం పేరుతో దేశాన్ని త‌న గుప్పిట్లోకి పెట్టు కోవాల‌ని చూస్తున్నారంటూ ఆరోపించారు. హిందీని రుద్దాల‌ని ప్ర‌య‌త్నిస్తే తాడో పేడో తేల్చుకుంటామ‌ని అన్నారు కుమార స్వామి.

Also Read : భాష పేరుతో పెత్త‌నం స‌హించం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!