Rahul Gandhi Yatra : ఏపీలో రాహుల్ యాత్రకు ఘన స్వాగతం
కేంద్ర సర్కార్ పై నిప్పులు చెరిగిన నేత
Rahul Gandhi Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోకి చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ శైలజానాథ్ సారథ్యంలో ఘన స్వాగతం పలికారు. 3,570 కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు రాహుల్ గాంధీ(Rahul Gandhi Yatra). ఆ యాత్ర తమిళనాడులోని కన్యాకుమారి నుండి మొదలైంది.
ఈ యాత్ర 150 రోజుల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో పూర్తి చేసుకుంది. శుక్రవారం రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఏపీలోకి ఎంటరైంది. రైతులు, మహిళలు, యువతీ యువకులు, వికలాంగులు ఘన స్వాగతం పలికారు రాహుల్ గాంధీకి.
ఆయనతో నడిచేందుకు, ఫోటోలు దిగేందుకు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన అనంతపురం జిల్లా లోని డి. హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోకి చేరుకుంది యాత్ర. ఇవాళ మొత్తం 14 కిలోమీటర్లకు పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపడతారు.
ఇప్పటికే ఆయన చేపట్టిన యాత్రకు భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుండి ప్రత్యేకంగా ఆదరాభిమానాలు లభిస్తున్నాయి. రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఎక్కడికి వెళ్లినా కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగి పోయిందని ఆరోపించారు.
కొంత మందికి లబ్ది చేకూర్చేందుకు ఆయన పాలన సాగిస్తున్నారని ప్రజల కోసం కాదని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా పాదయాత్ర అనంతరం తిరిగి ఓబుళాపురం మీదుగా రాహుల్ గాంధీ కర్ణాటకలోకి ప్రవేశిస్తారు. అక్కడ పాదయాత్ర చేపట్టాక అక్టోబర్ 18న రాహుల్ గాంధీ ఏపీలో ప్రవేశిస్తారు. 20 వరకు పాదయాత్ర చేపడతారు.
Also Read : రేవంత్ నిర్లక్ష్యం వేణుగోపాల్ ఆగ్రహం