Owaisi : దేశాభివృద్ధిలో ముస్లిం మహిళలు కీలకం
స్పష్టం చేసిన ఎంఐఎం చీఫ్ ఓవైసీ
Owaisi : కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ పై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై కీలక తీర్పు వెలువడకుండా రిజర్వ్ లో ఉంచారు. దీనిపై ఏర్పాటైన ధర్మాసనం చివరకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసింది. ఇద్దరు న్యాయమూర్తులలో ఒకరు కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు.
మరో న్యాయమూర్తి ఇది పూర్తిగా తప్పు అని హిజాబ్ ధరించినంత మాత్రాన ఒరిగేది ఏమీ ఉండదన్నారు. ప్రతిభ, నైపుణ్యం వారి వారి సమర్థత, కృషి మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన హిజాబ్ కేసు చివరకు అంతిమ తీర్పు ను ప్రకటించేందుకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి బదిలీ చేసింది.
దీంతో గత కొంత కాలంగా నివురు గప్పిన నిప్పులాగా ఉన్న హిజాబ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎంఐఎం చీఫ్ , హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi). ముస్లింలు ఈ దేశంలో భాగస్వామ్యం కావడం లేదా అని ప్రశ్నించారు. లక్షలాది మంది మహిళలు తమ తమ రంగాలలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
కానీ ఇదేదీ కేంద్ర సర్కార్ కు కనిపించడం లేదంటూ ఆరోపించారు ఓవైసీ. ఒక రకంగా తమ పిల్లల (యువతులు)ను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ. మహిళలు తలలు కప్పు కోవడం అంటే తమ మేధస్సును కప్పిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మేమేమీ హిజాబ్ ధరించమంటూ బలవంతం చేయం లేదని స్పష్టం చేశారు ఓవైసీ.
Also Read : ఏపీలో రాహుల్ యాత్రకు ఘన స్వాగతం