Seer Shivamurthy : మఠాధిపతి శివమూర్తిపై మరో కేసు
నలుగురు మైనర్ బాలికలపై వేధింపులు
Seer Shivamurthy : కర్నాటకకు చెందిన ప్రముఖ లింగాయత్ కమ్యూనిటీనికి చెందిన మఠాధిపతి శివమూర్తి శరణారావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఆయన ప్రస్తుతం జైలులో ఉన్నారు. తాజాగా శివమూర్తిపై(Seer Shivamurthy) మరో కేసు నమోదు చేశారు పోలీసులు.
మరో నలుగురు మైనర్ బాలికలు బయటకు వచ్చారు. వారు తమ గొంతు విప్పారు. తమపై పీఠాధిపతి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. తన మఠం హాస్టల్ లో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు లైంగిక నేరాల నియంత్రణకు సంబంధించి పిల్లల రక్షణ (పోక్సో ) చట్టం కింద శివమూర్తి శరణారావుపై రెండో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇప్పటి వరకు మఠాధిపతిపై మొదటి కేసులో ముగ్గురు మైనార్టీ బాలికలు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు. ప్రస్తుతం నలుగురు ఫిర్యాదు చేయడంతో రెండో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు ఏడుగరు మైనర్ బాలికలు మఠాధిపతి శివమూర్తి వరణారావుపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఇదిలా ఉండగా రేప్ ఆరోపణలపై జైలులో ఉన్న శివమూర్తి పై కొన్నాళ్లుగా తమపై వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించడం మరోసారి కలకలం రేపింది. జనవరి 2019 నుండి జూన్ 2022 మధ్య తమపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధిత బాలికలు ఆరోపించారని పోలీసులు తెలిపారు.
హాస్టల్ వార్డెన్ తో పాటు పీఠాధిపతిపై కేసు నమోదు చేశామన్నారు. ఇదిలా ఉండగా భారత్ జోడో యాత్ర ప్రారంభం కంటే ముందు రాహుల్ గాంధీ శివమూర్తి శరణారావును కలుసుకున్నారు. ఇది వివాదానికి దారి తీసింది.
Also Read : యెడియూరప్ప కేసు నుంచి తప్పుకున్న సీజేఐ