Aliya Assadi : సుప్రీంకోర్టు తీర్పుపై నమ్మకం ఉంది
హిజాబ్ అనుకూల విద్యార్థి అస్సాదీ
Aliya Assadi : కర్ణాటక ప్రభుత్వం హిజాబ్ పై విధించిన నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంద. జస్టిస్ హేమంత్ గుప్తా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని పేర్కొన్నారు.
హిజాబ్ పై నిషేధం ఉండాల్సిందేనంటూ స్పష్టం చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకించారు బెంచ్ లో సభ్యుడైన జడ్జి ధూలియా. చివరకు ఎటూ తేల్చక పోవడంతో తుది తీర్పును వెలువరించే బాధ్యతను భారత సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తికి బదిలీ చేశారు. దీంతో యావత్ బారత దేశమంతా ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
ఈ తరుణంలో హిజాబ్ అన్నది తమ ప్రాథమిక హక్కు అని, దాని వల్ల ఎవరికీ ఇబ్బంది అంటూ ఉండదని మొదటి నుంచీ వాదిస్తూ వస్తున్నారు విద్యార్థి అలియా అస్సాదీ(Aliya Assadi ). శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు తమకు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం తమకు ఉందన్నారు.
జస్టిస్ ధూలియా తమ ఆశలను మరింత పెంచేలా చేశారని కితాబు ఇచ్చారు. కాగా హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్లలో అలియా అస్సాదీ ఒకరు. ఉడిపి లోని ప్రభుత్వ పీయూ కాలేజీలో హిజాబ్ కోసం పోరాటం చేసిన విద్యార్థినులలో ఒకరుగా ఉన్నారు ఆమె. ఈ తీర్పు బాధిత బాలికల హక్కులను సమర్థించిందని పేర్కొన్నారు.
హిజాబ్ అన్నది తమకు సంబంధించిన వ్యక్తిగతమైనదని పేర్కొన్నారు. దీనిపై రాద్దాంతం చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు.
Also Read : దేశాభివృద్ధిలో ముస్లిం మహిళలు కీలకం