Gyanvapi Case : య‌థాత‌థంగా భ‌ద్ర ప‌ర్చాల్సిందే – కోర్టు

కార్బ‌న్ డేటింగ్ పిటిష‌న్ కొట్టివేత

Gyanvapi Case : యూపీ లోని జ్ఞాన్ వాపి కేసుకు సంబంధించి కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. శివ లింగంపై కార్బ‌న్ డేటింగ్ కోరుతూ చేసిన అభ్య‌ర్థ‌న‌కు సంబంధించిన పిటిష‌న్ ను వార‌ణాసి కోర్టు తిర‌స్క‌రించింది. మ‌సీదు ప‌క్క‌న శివ లింగం ఉందా లేదా అన్న దానిపై కోర్టు అనేక‌సార్లు విచార‌ణ చేప‌ట్టింది.

సెప్టెంబ‌ర్ 22న జ్ఞాన్ వాపి మ‌సీదు యాజ‌మాన్యాన్ని కాంప్లెక్స్ లోప‌ట క‌నుగొన్న శివ‌లింగం అని చెబుతున్న నిర్మాణానికి సంబంధించి ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే తెలియ చేయాల్సిందిగా కోరింది. ఈ మేర‌కు అందుకు సంబంధించిన ఆధారాల ప‌త్రాల‌ను దాఖ‌లు చేయాల‌ని స్ప‌ష్టం చేసింది.

కాగా మ‌సీదు ప్రాంగ‌ణంలోని శివ‌లింగం వంటి నిర్మాణంపై కార్బ‌న్ డేటింగ్ లేదా మ‌రేదైనా శాస్త్రీయ ప‌రిశోధ‌న కోరుతూ వేసిన పిటిష‌న్ ను జిల్లా కోర్టు శుక్ర‌వారం స్వీక‌రించింది. అయితే కార్బ‌న్ డేటింగ్ నిర్వ‌హించాల‌న్న డిమాండ్ ను కోర్టు తోసిపుచ్చింది. శృంగ‌ర్ గౌరీ – జ్ఞాన్ వాపి కేసులో వాది త‌ర‌పు న్యాయ‌వాదుల్లో ఒక‌రుగా ఉన్నారు మ‌ద‌న్ మోహ‌న్.

అయితే నిర్మానాన్ని య‌థాత‌థంగా భ‌ద్ర ప‌ర్చాల‌ని కోర్టు ఆదేశించింద‌ని తెలిపారు. ఈ వారం ప్రారంభంలో జ్ఞాన్ వాపి(Gyanvapi Case) కాంప్లెక్స్ కేసు విచార‌ణ సంద‌ర్భంగా ముస్లిం ప‌క్షం త‌న ప్ర‌తిస్పంద‌న‌ను స‌మ‌ర్పించింది. దీంతో కోర్టు త‌న తీర్పును రిజ‌ర్వ్ చేసింది.

శాస్త్రీయ ప‌రిశోధ‌న కోరుతూ వాది చేసిన అభ్య‌ర్థ‌న‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ అంజుమ‌న్ ఇంతేజామియా మ‌సీదు క‌మీటీ , ముస్లిం త‌ర‌పు న్యాయ‌వాదులు త‌మ వాద‌న‌లు స‌మర్పించారు.

రాయిపై కార్బ‌న్ డేటింగ్ సాధ్యం కాదు. ఎందుకంటే రాయి సేంద్రీయ ప‌దార్థం కాదు అని జ్ఞాన్ వాపి మసీదు సంరక్ష‌ణ క‌మిటీ న్యాయ‌వాదుల‌లో ఒక‌రైన ర‌యీస్ అహ్మ‌ద్ కోర్టులో తెలిపారు.

Also Read : సుప్రీంకోర్టు తీర్పుపై న‌మ్మ‌కం ఉంది

Leave A Reply

Your Email Id will not be published!