Owaisi : హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని అవుతారు
ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఓవైసీ కామెంట్స్
Owaisi : హిజాబ్ వివాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కర్ణాటక సర్కార్ హిజాబ్ ధరించడాన్ని నిషేధం విధించింది. దీనిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేసింది. ధర్మాసనం సీజేఐకి బదిలీ చేసింది.
ఈ తరుణంలో దీనిపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Owaisi) తీవ్రంగా స్పందించారు. ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన ముస్లిం మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి అవడం ఖాయమని జోష్యం చెప్పారు. సుప్రీంకోర్టు విభజన తీర్పు నేపథ్యంలో జరిగిన సభలో ఓవైసీ ప్రసంగించారు.
ముస్లిం మహిళలు తలలు కప్పు కోవడం అంటే తమ మనసును కూడా కప్పుకున్నట్లేనని పేర్కొన్నారు. మా అమ్మాయిలను తాము బెదిరిస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారను. టెక్నాలజీ విస్తృతంగా పెరిగిన ఈ రోజుల్లో చైతన్యం ఎక్కువగా ఉన్న ఈ తరుణంలో ఎవరు భయపడారని ప్రశ్నించారు అసదుద్దీన్ ఓవైసీ.
హిజాబ్ ధరించడం వల్ల మహిళలు తమ తోటి వారి కంటే ఏ మాత్రం తగ్గరని స్పష్టం చేశారు. మీరు గనుక హైదరాబాద్ కు వస్తే ఎంతో మంది మహిళలు డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తారని, కానీ వారు హిజాబ్ ధరించి ఉంటారని ఇందులో తప్పేముందంటూ ప్రశ్నించారు ఓవైసీ.
భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు పాఠశాలల గేట్ల వద్దే నిలిచి పోతాయా అని నిలదీశారు. ఇదే హిజాబ్ ధరించిన మహిళ ఏదో ఒక రోజు దేశానికి పీఎం కావడం ఖాయమన్నారు ఓవైసీ మరోసారి.
Also Read : మాజీ ప్రొఫెసర్ సాయిబాబ నిర్దోషి – కోర్టు