India Falls Hunger Index : హంగర్ ఇండెక్స్ లో దిగజారిన భారత్
101 నుంచి 107 స్థానానికి పడిపోయింది
India Falls Hunger Index : నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనలో భారత దేశం రోజు రోజుకు అన్ని రంగాలలో వెనుకంజ(India Falls Hunger Index) వేస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకటించిన హంగర్ ఇండెక్స్ లో దాయాది పాకిస్తాన్ , నేపాల్ కంటే వెనుకంజలో ఉంది. గత ఏడాది 101 స్థానం ఉండగా ఈఏడాది ప్రకటించిన ఇండెక్స్ లో 107కి పడి పోయింది.
ఐరిష్ సహాయ సంస్థ కన్సర్ వరల్డ్ వైడ్ , జర్మన్ సంస్థ వైల్డ్ హంగర్ హిల్స్ సంయుక్తంగా నివేదికను వెల్లడించాయి. భారతదేశంలో ఆకలి స్థాయి తీవ్రమైనదిగా పేర్కొన్నాయి. గత ఏడాది 2021లో ప్రకటించిన హంగర్ ఇండెక్స్ లో 116 దేశాలలో భారత్ స్థానం 101గా ఉన్నది.
కానీ ఈసారి మరో ఆరు స్థానాలు దిగజారింది ఇండియా. తాజాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ను ఈ ఏడాది 2022కి గాను 121 దేశాలలో సర్వే చేపట్టింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ లకంటే వెనుకబడి ఉండడం గమనార్హం. చైనా, టర్కీ, కువైట్ తో సహా 17 దేశాలు ఐదు కంటే తక్కువ జీహెచ్ఐ స్కోర్ తో టాప్ ర్యాంక్ ను పంచుకున్నాయని తెలిపింది.
ఇదిలా ఉండగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం దిగజారడంపై కాంగ్రెస్ ఎంపీ పి. చిదంబరం స్పందించారు. నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ల పాలనకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. 2014 నుండి భారత్ ప్లేస్ దిగజారుతూ వస్తోందని ఆరోపించారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం, ఆకలి, కుంగి పోవడం , వృధా వంటి నిజమైన సమస్యలను ప్రధాన మంత్రి మోదీ ఎప్పుడు ప్రస్తావిస్తారంటూ ప్రశ్నించారు.
Also Read : హైదరాబాద్ కు అరుదైన పురస్కారం