Nirmala Sitharaman : డాలర్ బలపడడం వల్లే రూపాయి పతనం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభానికి, రూపాయి క్షీణించడానికి గల ప్రధాన కారణాలను పక్కన పెట్టేసేందుకు ప్రయత్నం చేశారు. విచిత్రం ఏమిటంటే ఎందుకు రూపాయి బలహీన పడిందనే దానికి సమాధానం చెప్పకుండా దాట వేశారు.
ఆపై అమెరికా డాలర్ పై కీలక వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. రూపాయి క్షీణించడానికి ప్రధాన కారణం డాలర్ బలపడడమేనని పేర్కొన్నారు. దీంతో ప్రముఖ ఆర్థిక వేత్తలు ఆశ్చర్యానికి లోనయ్యారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గత కొంత కాలంగా ఎన్నడూ లేని రీతిలో పెరుగుతూ పోతుండడం ఇబ్బందికరంగా మారింది దేశానికి.
ఈ రెండూ ఆర్థిక వ్యవస్థపై కీలక ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మలా సీతారామన్. రూపాయి కనిష్ట స్థితికి పడి పోయింది. ప్రస్తుతం డాలర్ పరంగా చూస్తే భారతీయ రూపాయి విలువ ఒక డాలర్ కు రూ. 82.69 గా ఉంది.
దీని తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఇతర వర్ధమాన మార్కెట్ కరెన్సీల కంటే రూపాయి చాలా మెరుగ్గా ఉందన్నారు కేంద్ర మంత్రి. ఇక నుంచి రూపాయి మరింత దిగజారకుండా చూస్తానని చెప్పారు.
ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు నిర్మలా సీతారామన్. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అస్థిరత లేకుండా చూసుకోవడంపై ఫోకస్ పెట్టిందని చెప్పారు కేంద్ర మంత్రి.
భారతీయ కరెన్సీ విలువను నిర్ణయించేందుకు మార్కెట్లో జోక్యం చేసుకోవడం లేదన్నారు.
Also Read : టెలికాం రంగంలో 5జీ పెను సంచలనం