Boora Narsaiah Goud : దొర ఇలాఖాలో బానిసలకే పెద్దపీట
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
Boora Narsaiah Goud : భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కాషాయంలో ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్కెచ్ వేశారంటే వర్కవుట్ కావాల్సిందే.
ఓ వైపు గులాబీ దళం మూకుమ్మడిగా బీజేపీని టార్గెట్ చేస్తుంటే , దళపతి కేసీఆర్ తన కూతురుతో కలిసి బీఆర్ఎస్ కోసం ఢిల్లీలో తిష్ట వేసిన సమయంలో బిగ్ షాక్ తగిలింది.
ఆ పార్టీలో కీలక నాయకుడిగా, నిబద్దత కలిగిన వ్యక్తిగా పేరుంది మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు(Boora Narsaiah Goud). ఆయన ప్రజా డాక్టర్ గా పేరొందారు. ఒకసారి ఎంపీగా గెలుపొందారు. సమీకరణలు మారడం, కొందరు చేయి ఇవ్వడం వల్ల తాను ఓడి పోయానని పేర్కొన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇక్కడ మూడు పార్టీలు శక్తి వంచన లేకుండా పోరాడుతున్నాయి.
అధికార పార్టీ అన్ని శక్తులను ఒడ్డుతోంది. ఈ తరుణంలో కీలకమైన నేతగా ఉన్న బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక్కడ 70 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. వీరి ఓటు శాతం ఎక్కువ. కానీ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలన్నీ అగ్ర కులానికి చెందిన రెడ్లకే సీట్లు కేటాయించాయి.
చివరి దాకా బూర నర్సయ్య గౌడ్ టికెట్ ఆశించారు. కానీ మంత్రి జగదీశ్ రెడ్డి తనకు అడ్డుగా ఉన్నాడంటూ సంచలన కామెంట్స్ చేశారు గౌడ్. ఈ సందర్భంగా దొర ఇలాఖాలో బానిసలకే పెద్ద పీట వేస్తారంటూ ఆరోపించారు.
ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఇవాల బూర వెళ్లి పోతే రేపు ఎంత మంది గులాబీని వీడుతారనేది పార్టీలో బయట చర్చనీయాంశంగా మారింది.
Also Read : బీజేపీలోకి నేతలు వెళ్లకుండా అడ్డుకుంటా