TSRTC DPS : డిజిటల్ చెల్లింపులకు టీఎస్ఆర్టీసీ శ్రీకారం
మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద సక్సెస్
TSRTC DPS : దేశ వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలకు ప్రయారిటీ పెరుగుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరాక డిజిటల్ భారత దేశంగా చేయాలని కంకణం కట్టుకుంది. అందులో భాగంగా ఇవాళ 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించారు.
ఈ తరుణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కొత్త దారుల్లో ప్రయత్నాలు చేస్తూ ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో మునిగి పోయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC DPS). ఇప్పటికే మోయలేని భారంగా తయారైన సంస్థను గట్టెక్కించేందుకు తంటాలు పడుతున్నారు మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్. ఇందులో భాగంగా మోయలేని భారాన్ని ప్రయాణీకులపై మోపారు.
ఆపై పండుగుల సందర్భంగా పెంచుతూ వచ్చారు. కొత్తగా నగరంలో ప్యాకేజీలు ప్రవేశ పెట్టారు. దీనికి నగర దర్శిని అని పేరు పెట్టారు. తాజాగా తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్రయాణీకుల కసోం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతోంది. ఇక నుంచి బస్సు ప్రయాణాలను ఇబ్బంది లేని ప్రయాణంగా మార్చే దిశగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా త్వరలో బస్సు ప్రయాణికులకు నగదు రహిత లావాదేవీలను ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ఆర్టీసీ ఒక పైలట్ ప్రాజెక్టును అమలు చేసింది. రాష్ట్రంలోని 14 అత్యాధునిక బస్సులలో ఇంటెలిజెంట్ టికెట్ జారీఈ యంత్రాలతో ప్రాజెక్టు కొనసాగుతోంది.
ఈ పైలట్ ప్రాజెక్టు కంద బస్సు ప్రయాణీకులు డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి టికెట్ ధరలు చెల్లించేందుకు వీలు కల్పిస్తోంది టీఎస్ఆర్టీసీ. దీని వల్ల కండక్టర్ల కు పని అంటూ ఉండదు.
Also Read : డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు జాతికి అంకితం