Arvind Kejriwal : సిసోడియా రేపు అరెస్ట్ కావ‌చ్చు – కేజ్రీవాల్

మ‌నీష్ మ‌రో భ‌గ‌త్ సింగ్ అన్న సీఎం

Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న స‌హ‌చ‌రుడు, ఢిల్లీ స‌ర్కార్ లో ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న మ‌నీష్ సిసోడియాకు సీబీఐ స‌మ‌న్లు పంపింద‌ని, అక్టోబ‌ర్ 17న సోమ‌వారం ఆయ‌న‌ను అరెస్ట్ చేస్తార‌ని జోష్యం చెప్పారు.

ఆదివారం అర‌వింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా ఢిల్లీ ఎక్సైజ్ పాల‌సీ కేసులో మ‌నీష్ సిసోడియాకు సీబీఐ స‌మ‌న్లు జారీ చేసింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ నోటీసు పంపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు కేజ్రీవాల్.

గుజ‌రాత్ లో త‌మ పార్టీకి పెరుగుతున్న జ‌నాద‌ర‌ణ‌ను త‌ట్టుకోలేకే కేంద్రం ఇలాంటి జిమ్మిక్కులు చేస్తోందంటూ ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు ఇప్ప‌టి వ‌ర‌కు దొర‌క‌లేద‌ని అయినా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ప‌దే ప‌దే వేధింపుల‌కు పాల్ప‌డుతున్నాయంటూ మండిప‌డ్డారు సీఎం.

కేసును ముమ్మ‌రం చేస్తున్న ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి కేజ్రీవాల్ మ‌నీష్ సిసోడియాను(Manish Sisodia) భ‌గ‌త్ సింగ్ తో పోల్చారు. స‌మ‌న్లు ఇచ్చిన వెంట‌నే మ‌నీష్ సిసోడియాను రేపు అరెస్ట్ చేస్తారంటూ ఆప్ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. జైలు క‌డ్డీలు, ఉచ్చు బెదిరింపులు భ‌గ‌త్ సింగ్ స్పూర్తిని ఎప్ప‌టికీ నిరోధించ లేవ‌న్నారు కేజ్రీవాల్.

స్వాతంత్రం కోసం ఇది జ‌రుగుతున్న రెండో పోరాట‌మ‌న్నారు. మ‌నీష్ సిసోడియా, స‌త్యేంద‌ర్ జైన్ లు నేటి భ‌గ‌త్ సింగ్ అంటూ కితాబు ఇచ్చారు. ఈ మేర‌కు ట్వీట్ కూడా చేశారు.

ప్ర‌స్తుతం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు ఆప్ లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : ఎంఐఎం యుపీ చీఫ్ షౌక‌త్ అలీపై కేసు

Leave A Reply

Your Email Id will not be published!