DK Shivakumar : క‌ర్ణాట‌క‌లో 150 సీట్లు గెలుస్తాం – శివ‌కుమార్

పొత్తు లేకుండానే ప‌వ‌ర్ లోకి వ‌స్తాం

DK Shivakumar : క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివ‌కుమార్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌ర్ణాట‌క‌లో ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని వ్యూహాలు ప‌న్నినా భార‌తీయ జ‌న‌తా పార్టీని ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండానే 150 సీట్లు గెలుచుకుంటుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు పీసీసీ చీఫ్‌.

ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర క‌ర్ణాట‌క‌లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న త‌మిళ‌నాడు, కేర‌ళ‌లలో పూర్తి చేశారు. మొత్తం 3,570 కిలోమీట‌ర్లు క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగుతోంది.

ఇదిలా ఉండ‌గా పాద‌యాత్ర‌లో రాహుల్ గాంధీ వెంట ఉన్న కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్ బ‌ళ్లారిలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో 244 సీట్లు ఉన్నాయి. ఇందులో త‌ప్ప‌కుండా 150కి పైగానే తాము విజ‌యం సాధిస్తామ‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లో భార‌త్ జోడో యాత్ర‌కు భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చింద‌న్నారు.

ఎక్క‌డ చూసినా రాహుల్ గాంధీకి, పార్టీకి నీరాజ‌నాలు ప‌లికార‌ని చెప్పారు. ఎలాంటి మ‌ద్ద‌తు లేకుండానే ఎవ‌రి పై ఆధార ప‌డ‌కుండానే తాము అధికారంలోకి వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు డీకే శివ‌కుమార్(DK Shivakumar).

త‌సారి ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటు వేయాలో ఎవ‌రిని అందలం ఎక్కించాలో ఎవ‌రిని దించాలో డిసైడ్ అయ్యార‌ని జోష్యం చెప్పారు. ప్ర‌స్తుతం బీజేపీ ప్ర‌భుత్వం అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా మారింద‌న్నారు డీకేఎస్.

బీజేపీని ప్ర‌జ‌లు న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. మాయ మాట‌లు సొల్లు క‌బుర్లు త‌ప్ప వారు చేసింది ఏమీ లేద‌న్నారు డీకే శివ‌కుమార్.

Also Read : గుజ‌రాత్ లో బీజేపీకి ఢోకా లేదు – ఠాకూర్

Leave A Reply

Your Email Id will not be published!