Grenade Attack : కాశ్మీర్ లో గ్రెనేడ్ దాడి ఇద్ద‌రు కార్మికులు మృతి

ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు చెందిన కార్మికులు

Grenade Attack : జ‌మ్మూ కాశ్మీర్ లో దాడులు, కాల్పులు ఆగ‌డం లేదు. ఉగ్ర‌వాదులు రెచ్చి పోతున్నారు. భార‌త బ‌ల‌గాల శ‌క్తి సామ‌ర్థ్యాల‌కు స‌వాల్ గా మారారు. ఇవాళ కాశ్మీర్ లోని షోపియాన్ లో జ‌రిగిన గ్రెనేడ్ దాడిలో(Grenade Attack) ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు. అదే జిల్లాలో ఇటీవ‌లే కాశ్మీరీ పండిట్ ను కాల్పి చంపారు.

కొద్ది రోజుల‌కే ఈ దాడి జ‌రగ‌డం మ‌రింత భ‌యాందోళ‌న‌కు గురి చేస్తోంది. కాగా గ్రెనేడ్ విసిరిన కొన్ని గంట‌ల త‌ర్వాత దాడి చేసిన వ్య‌క్తిని అరెస్ట్ చేసిన‌ట్లు కాశ్మీర్ పోలీసులు వెల్ల‌డించారు. షోపియాన్ లోని హ‌ర్మెన్ ప్రాంతంలో అర్ధ‌రాత్రి ఒక ఉగ్ర‌వాది స్థానికేత‌ర కార్మికుల‌పై దాడికి పాల్ప‌డ్డాడు.

మృతి చెందిన ఇద్ద‌రు కూలీల‌ను యూపీలోని క‌నూజ్ కు చెందిన రాం సాగ‌ర్ , మోనీష్ కుమార్ గా గుర్తించిన‌ట్లు చెప్పారు పోలీసులు. గ్రెనేడ్ ను విసిరింది నిషిద్ద ఉగ్ర‌వాద సంస్థ ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఇమ్రాన్ బ‌షీర్ గ‌నాయ్ ను అదుపులోకి తీసుకున్నామ‌ని చెప్పారు.

దాడి జ‌రిగిన వెంట‌నే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయ‌ని జ‌మ్మూ కాశ్మీర్ అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీస్ విజ‌య్ కుమార్ స్ప‌ష్టం చేశారు. హైబ్రీడ్ టెర్ర‌రిస్టులు అనేది జాబితా చేయ‌ని వ్య‌క్తులు. వీళ్లు తీవ్ర‌వాద దాడుల‌కు పాల్ప‌డ‌తారు.

కానీ ఎలాంటి జాడ లేకుండా తిరిగి స‌మాజంలో సాధార‌ణ వ్య‌క్తులుగా మారి పోతార‌ని వెల్ల‌డించారు విజ‌య్ కుమార్. కాగా శ‌నివారం పోషియాన్ లోని చౌద‌రి గుండ్ గ్రామంలో కాశ్మీరీ పండిట్ పూర‌న్ క్రిష‌న్ భ‌ట్ ను ఉగ్ర‌వాదులు కాల్చి చంపారు.

Also Read : కొలీజియం వ్య‌వస్థపై పున‌రాలోచించాలి – రిజిజు

Leave A Reply

Your Email Id will not be published!