Kiren Rijiju : కొలీజియం వ్య‌వస్థపై పున‌రాలోచించాలి – రిజిజు

కేంద్ర న్యాయ శాఖ మంత్రి షాకింగ్ కామెంట్స్

Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ వ్య‌వ‌స్థ‌పై బాణం ఎక్కు పెట్టారు. గ‌త కొంత కాలంగా న్యాయ‌మూర్తుల నియామ‌కాల విష‌యంలో పాటిస్తూ వ‌స్తున్న కొలీజియం వ్య‌వ‌స్థ స‌రిగా లేదంటూ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అయితే ఇది త‌న అభిప్రాయం కాద‌ని దేశంలోని 135 కోట్ల భార‌తీయుల అభిప్రాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా కొలీజియం అనేది భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) నేతృత్వంలో ఉంటుంది. న్యాయ స్థానంలోని న‌లుగురు సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల‌ను క‌లిగి ఉంటుంది.

న్యాయ‌మూర్తుల నియామ‌కాల కొలీజియం వ్య‌వ‌స్థతో ప్ర‌జ‌లు ఎవ‌రూ సంతోషంగా లేర‌ని అన్నారు కిరెన్ రిజిజు(Kiren Rijiju). రాజ్యాంగ స్ఫూర్తి ప్ర‌కారం న్యాయ‌మూర్తుల‌ను నియ‌మించ‌డం ప్ర‌భుత్వ ప‌ని అని కేంద్ర న్యాయ శాఖ మంత్రి స్ప‌ష్టం చేశారు. రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ ప్రచురించే పాంచ‌జ‌న్య వార‌ప‌త్రిక ఆధ్వ‌ర్యంలో అహ్మ‌దాబాద్ లో ఏర్పాటు చేసిన స‌బ‌ర్మ‌తి సంవాద్ కార్య‌క్ర‌మంలో కిరెన్ రిజిజు మాట్లాడారు.

న్యాయ‌మూర్తుల‌లో స‌గం మంది నియామ‌కాల‌ను నిర్ణ‌యించ‌డంలో నిమ‌గ్న‌మై ఉన్నార‌ని అన్నారు. ఈ కార‌ణంగా వారి ప్రాథ‌మిక ప‌నిని తాను గ‌మ‌నించాన‌ని చెప్పారు. అత్యున్న‌త న్యాయ వ్య‌వ‌స్థ నియామ‌కాల కొలీజియం పై పున‌రాలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

1993 వ‌ర‌కు భార‌త దేశంలోని ప్ర‌తి న్యాయ‌మూర్తిని భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో సంప్ర‌దించి న్యాయ మంత్రిత్వ శాఖ నియ‌మించింద‌ని గుర్తు చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌ముఖులు ఉన్నార‌ని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీశాయి.

Also Read : ఎన్నిక‌ల వేళ గుజ‌రాత్ లో వ్యాట్ త‌గ్గింపు

Leave A Reply

Your Email Id will not be published!