S Jai Shankar : స‌రిహ‌ద్దు వివాదంపై జై శంక‌ర్ కామెంట్స్

ఇరు దేశాల మ‌ధ్య శాంతి ప్రాతిప‌దిక కావాలి

S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త‌, చైనా దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు త‌గ్గాలంటే ఒక్క‌టే మార్గం క‌లిసి చ‌ర్చించ‌డమేన‌ని పేర్కొన్నారు. తాము ఎల్ల‌ప్పుడూ శాంతిని కోరుకుంటున్నామ‌ని కానీ చైనా కావాల‌ని వివాదాలు సృష్టించేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఆధునిక కాలంలో, టెక్నాల‌జీ విస్తృతంగా విస్త‌రించిన ఈ స‌మ‌యంలో యుద్దానికి ప్లేస్ అన్న‌ది లేద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు క‌రోనా త‌ర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయ‌ని తెలిపారు. ఇక భార‌త్ – చైనా మ‌ధ్య సాధార‌ణ సంబంధాల‌కు స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో శాంతి మాత్ర‌మే ప్రాతిప‌దిక అని స్ప‌ష్టం చేశారు జై శంక‌ర్(S Jai Shankar).

మంగ‌ళ‌వారం సెంట‌ర్ ఫ‌ర్ కాంటెంప‌ర‌రీ చైనా స్ట‌డీస్ (సిసిసిఎస్) నిర్వ‌హించిన స‌ద‌స్సులో ల‌డ‌ఖ్ సెక్టార్ లో సైనిక ప్ర‌తిష్టంభ‌న కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా చైనా విదేశాంగ విధానం, నూత‌న యుగంలో అంతర్జాతీయ సంబంధాలు అనే అంశంపై ఎస్ జై శంక‌ర్ ప్ర‌సంగించారు. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

వాస్త‌వ నియంత్ర‌ణ రేఖ (ఎల్ఏసీ) లో శాంతి, ప్ర‌శాంతత నెల‌కొనేంత దాకా చైనాతో మొత్తం సంబంధాన్ని సాధారణీక‌రించ‌డం సాధ్యం కాద‌ని అన్నారు. అంత‌ర్జాతీయ వేదిక‌పై లోతైన సంబంధాల‌ను ఏర్ప‌ర్చు కోవడం, భార‌త‌దేశ ప్ర‌యోజ‌నాల‌పై మంచి అవ‌గాహ‌న‌ను ప్రోత్స‌హించడం దేశాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని చెప్పారు జై శంక‌ర్.

రెండు దేశాలు త‌మ సంబంధాల‌పై దీర్ఘ‌కాలిక దృక్ఫ‌థాన్ని తీసుకోవాల‌నే సుముఖ‌త‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి.

Also Read : కాశ్మీర్ లో గ్రెనేడ్ దాడి ఇద్ద‌రు కార్మికులు మృతి

Leave A Reply

Your Email Id will not be published!