TCS COO : గీత దాటితే వేటు త‌ప్ప‌దు – టీసీఎస్ సీఓఓ

మూన్ లైటింగ్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

TCS COO : ప్ర‌పంచ వ్యాప్తంగా మూన్ లైటింగ్ అనేది ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు. ఇదేదో నిగూఢ‌మైన ప‌ద‌మ‌ని అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే. ప్ర‌ధానంగా దీనిని ఎక్కువ‌గా ఐటీ రంగంలో వాడ‌తారు. ఎందుకంటే ఆయా సంస్థ‌ల‌లో ప‌ని చేస్తున్న ఉద్యోగులు ప‌ని చేస్తున్న ప్ర‌స్తుత కంపెనీతో పాటు ఇత‌ర కంపెనీల‌కు కూడా ప‌ని చేస్తుంటారు.

ఏ కంపెనీ ఒప్పుకోదు ఇలా చేసేందుకు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌చ్చాక గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ఆయా కంపెనీలే కాదు అన్ని రంగాలు వెసులుబాటు ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నాయి. ఎందుకంటే ప‌ని చేయ‌డం కంటే ఆరోగ్యం ముఖ్య‌మ‌న్న భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలో ఉండ‌డమే.

అంతే కాకుండా వ‌ర్క్ ఫ్రం హోమ్ అన్న‌ది ఎక్కువ‌గా పెరిగింది వ‌ర‌ల్డ్ వైడ్ గా. ఇప్ప‌టికే దిగ్గ‌జ కంపెనీల‌న్నీ త‌మ ఆఫీసుల‌కు రావాలంటూ ఈమెయిల్స్ ద్వారా పంపాయి. కానీ 10 శాతం మంది ఉద్యోగులు కూడా ఓకే చెప్ప‌క పోవ‌డం భారీ షాక్ కు గురి చేసేలా చేశాయి. ఈ త‌రుణంలో చాలా మంది ఉద్యోగాలు మానేయ‌డ‌మో, ఇత‌ర కంప‌నీల‌తో ప‌ని చేయ‌డ‌మో చేస్తూ వ‌స్తున్నారు.

ఇదే క్ర‌మంలో మూన్ లైటింగ్ సిస్ట‌మ్ ను తాము ఒప్పుకునే ప్ర‌స‌క్తి లేదంటున్నారు ప్ర‌ముఖ టాటా కంపెనీకి చెందిన టీసీఎస్ సిఓఓ గ‌ణ‌ప‌తి సుబ్ర‌మ‌ణియ‌న్(TCS COO). ప్ర‌స్తుతానికి త‌మ కంపెనీలో అలాంటి వారు ఎవ‌రున్నా మొద‌టి త‌ప్పుగా ప‌రిగ‌ణిస్తామ‌ని , వారిపై చ‌ర్య‌లు ఉండ‌వ‌న్నారు.

కానీ మ‌రోసారి ఇలా చేయ‌వ‌ద్ద‌ని మాత్రం హెచ్చ‌రిస్తామ‌న్నారు. ప‌ని చేస్తున్న వారంతా త‌మ కుటుంబ స‌భ్యుల‌ని వారిపై చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కొన్ని కంపెనీల‌కు ఆమోదించినా తాము మాత్రం ఒప్పుకోమ‌న్నారు.

Also Read : అంద‌రి క‌ళ్లు రోజ‌ర్ బిన్నీ పైనే

Leave A Reply

Your Email Id will not be published!