Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ఇంత అరాచ‌క‌మా

నిల‌దీసిన టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు

Pawan Kalyan : తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు. అంత‌కు ముందు జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సంద‌ర్బంగా విజ‌య‌వాడ‌లో హోట‌ల్ లో ఉన్న ప‌వ‌న్ ను చంద్ర‌బాబు నాయుడు స్వ‌యంగా వెళ్లి క‌లిశారు.

గంట పాటు ఏకాంతంగా మాట్లాడారు. ఏం మాట్లాడార‌న్న‌ది బ‌య‌ట‌కు చెప్ప‌లేదు ఇరువురు నేత‌లు. జ‌న‌సేనానితో భేటీ అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. పోలీసులే శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను బాధ్యుడిగా చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

విశాఖ నుంచి వెళ్లి పోవాలంటూ నోటీసులు ఇచ్చార‌ని మండిప‌డ్డారు చంద్ర‌బాబు నాయుడు. ప‌వ‌న్ క‌ళ్యాన్ ఈ రాష్ట్రానికి చెందిన పౌరుడు కాదా అని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా చాలా కాలం త‌ర్వాత చంద్ర‌బాబు నాయుడు(N Chandrababu Naidu) ప‌వ‌న్ తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాష్ట్రంలో రాజ‌కీయాలు వేగంగా మారి పోతున్నాయి.

ఇదే స‌మ‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ సోము వీర్రాజు సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంఘీభావం తెలిపారు. మ‌రో వైపు ఏపీలో రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర కొన‌సాగుతోంది. ఏది ఏమైనా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వాడిన భాష ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది.

ఏపీలో వైసీపీకి వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు చంద్ర‌బాబు నాయుడు.

Also Read : అమ‌రావ‌తి రైతన్న‌లకు రాహుల్ భ‌రోసా

Leave A Reply

Your Email Id will not be published!