Shashi Tharoor : ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కోటి దండాలు

ప్ర‌జాస్వామ్య స్పూర్థిని చాటారన్న‌ థ‌రూర్

Shashi Tharoor : ఎట్ట‌కేల‌కు ఉత్కంఠ వీడింది. అంతా అనుకున్న‌ట్లుగానే మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే 137 ఏళ్ల సుదీర్ఘ చ‌రిత్ర‌కు సాక్షిభూతంగా నిలిచిన ఏఐసీసీకి 36వ అధ్య‌క్షుడిగా కొలువుతీరారు. ఆయ‌న త‌న ప్ర‌ధాన పోటీదారుడు, స‌హ‌చ‌ర రాజ్య‌స‌భ స‌భ్యుడు శ‌శి థ‌రూర్ పై 6,978 పైగా ఓట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించారు ఖ‌ర్గే.

ఇదిలా ఉండ‌గా మొద‌టి నుంచీ అస‌మ్మ‌తి స్వ‌రం వినిపిస్తూ వ‌చ్చిన నాయ‌కుడిగా పేరొందారు శ‌శి థ‌రూర్(Shashi Tharoor). అయితే తాను అస‌మ్మ‌తి వాదిని కాద‌ని కేవ‌లం పార్టీలో ప్ర‌జాస్వామ్యం ఉండాల‌నే ఉద్దేశంతో ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆపై డెమోక్ర‌సీలో ప్ర‌శ్నించ‌డం ఒక ప్ర‌ధాన ఆయుధ‌మ‌ని పేర్కొన్నారు.

ఘ‌న‌మైన చ‌రిత్ర‌, అద్భుత‌మైన వార‌స‌త్వం క‌లిగిన పార్టీలో హైక‌మాండ్ క‌ల్చ‌ర్ నెల‌కొంద‌ని దానిని తొల‌గిస్తేనే పార్టీ బాగు ప‌డుతుంద‌న్నారు శ‌శి థ‌రూర్. ఇవాళ అధ్య‌క్ష ఎన్నిక వెలువ‌డిన వెంట‌నే ఆయ‌న కొత్త‌గా త‌న‌పై గెలుపొందిన ఖ‌ర్గేకు అభినంద‌న‌లు తెలిపారు ట్విట్ట‌ర్ వేదిక‌గా. ఆపై ఆయ‌నే స్వ‌యంగా ఖ‌ర్గేకు కంగ్రాట్స్ తెలిపారు.

ఇదిలా ఉండ‌గా గాంధీ ఫ్యామిలీ స‌పోర్ట్ లేకుండా శ‌శి థ‌రూర్(Shashi Tharoor) ఏకంగా 1,000కి పైగా ఓట్లు సాధించారు. ఇది మామూలు విష‌యం కాదు. ఒక ర‌కంగా అద్భుత‌మైన ఫీట్ గా అభివ‌ర్ణించ‌క త‌ప్ప‌దు. కాగా త‌న‌ను న‌మ్మి ఓటు వేసినందుకు ప్ర‌తి ఒక్క స‌భ్యుడికి పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు శ‌శిథ‌రూర్.

వారంద‌రికీ కోటి దండాలు అంటూ స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ట్వీట్ వైర‌ల్ గా మారింది.

Also Read : ఇక నుంచి పార్టీ చీఫ్ సుప్రీం – రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!