Arvind Kejriwal : మోదీజీ బడుల సంగతి చూడండి – కేజ్రీవాల్
మన్ కీ బాత్ తర్వాత విద్యపై ఫోకస్ పెట్టండి
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై. విద్యారంగం కునారిల్లి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. వెంటనే విద్యా వ్యవస్థను బాగు చేసేందుకు ఫోకస్ పెట్టాలన్నారు.
పొద్దస్తమానం పెట్టుబడిదారులను స్మరించడం మాను కోవాలని సూచించారు. దేశంలో గుజరాత్ మోడల్ కు కాలం చెల్లిందన్నారు. మీరు చెప్పిన ఏ ఒక్క దానిని ఇప్పటి వరకు అమలు చేయలేక పోయారని ఎద్దేవా చేశారు. బుధవారం కేజ్రీవాల్(Arvind Kejriwal) మోదీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా మోడల్ ను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ పాఠశాలలను నిర్వహించే వారు మరింత అనుభవం పొందారని అన్నారు. సహకరిస్తే కేవలం ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా మారుతాయని సీఎం స్పష్టం చేశారు.
ఈ విషయంలో శ్రద్ద చూపాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీలు విద్యపై ఫోకస్ పెట్టాలని సూచించారు సీఎం. ఈ దేశంలో ప్రతి ఒక్కరు తాము సాధించిన విజయాలను చూసి చెబుతున్నారని పేర్కొన్నారు. దేశం కోసం అందరం కలిసి పనిచేద్దామంటూ పిలుపునిచ్చారు అరవింద్ కేజ్రీవాల్.
ఈ రంగంలో తమకు ఉన్న అనుభవాన్ని దేశ వ్యాప్తంగా ఉపయోగించు కోవాలని సూచించారు సీఎం. విద్య అనేది తమ సర్కార్ సాధించిన అద్భుత విజయమని పేర్కొన్నారు.
Also Read : ఓటమి పాలైనా చెరగని ముద్ర
SHARE MAX – BIG STATEMENT BY CM ARVIND KEJRIWAL
Very Happy & Heartening to see PM Modi has shown interest in Education
This is the Biggest Victory of AAP and its Education Model
We appeal to PM Modi to use Delhi Govt expertise in Transforming Education System : @ArvindKejriwal pic.twitter.com/uKAO6ztuiX
— 🇮🇳 DaaruBaaz Mehta 🇮🇳 (@DaaruBaazMehta) October 19, 2022