Chandrababu Naidu : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ
ప్రకటించిన చంద్రబాబు నాయుడు
Chandrababu Naidu : అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. పవర్ లో ఉన్న వైసీపీ, టీఆర్ఎస్ లు చాప కింద నీరులా మరింత బలోపేతం చేసేందుకు ఫోకస్ పెడుతున్నాయి. తాజాగా ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా మారి పోతున్నాయి. నిన్నటి దాకా భారతీయ జనతా పార్టీతో దోస్తానా చేస్తూ వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకున్నారు.
ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడుతో(Chandrababu Naidu) ముచ్చటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ ను వైజాగ్ నుంచి వెళ్లి పోవాలని కోరడం, మంగళగిరిలో పార్టీ నాయకులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన సీరియస్ ప్రసంగం కలకలం రేపింది. ఇదే క్రమంలో ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
ఏపీలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దమేనంటూ ప్రకటించారు. పల్నాడులో ఆయన పర్యటించిన సందర్భంగా ముందస్తుపై మరోసారి వ్యాఖ్యానించడం , పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం , బీజేపీ నుంచి మాజీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ గుడ్ బై చెప్పడం రాజకీయ వర్గాలలో పెను సంచలనంగా మారాయి.
ఇక ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మరోసారి పవర్ లోకి రావాలని వైస్సార్సీపీ చీఫ్, ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రంగం సిద్దం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు కూడా అప్పగించారు. ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి.
Also Read : జనసేనానిపై భూమన కన్నెర్ర