UK Visa Process : 15 రోజుల్లో యుకె వీసా – హై క‌మిష‌న‌ర్

ప్ర‌వాస భారతీయుల‌కు ఖుష్ క‌బ‌ర్

UK Visa Process : బ్రిట‌న్ వెళ్లాల‌ని అనుకునే ప్ర‌వాస భార‌తీయులు, విద్యార్థుల‌కు తీపిక‌బురు చెప్పింది యుకె(UK Visa Process). ఈ మేర‌కు కేవ‌లం 15 రోజుల్లోనే వీసాల‌ను జారీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు భార‌త దేశంలోని బ్రిటిష్ హై క‌మిష‌న‌ర్ అలెక్స్ ఎల్లిస్ . జారీ ప్ర‌క్రియ‌లో ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా గ‌త సంవ‌త్స‌రం కంటే ఈసారి భార‌తీయ విద్యార్థుల సంఖ్య మ‌రింత పెరిగింద‌ని పేర్కొన్నారు. బ్రిటిష్ హై క‌మిష‌న‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ కీల‌క విశేషాలు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా విద్యార్థుల సంఖ్య 89 శాతం పెరిగింద‌ని తెలిపారు. విజిట‌ర్ వీసా ప్రాసెసింగ్ స‌మ‌యాలు మ‌రింత మెరుగు ప‌రిచేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

నైపుణ్యం క‌లిగిన కార్మికుల వీసాలు వేగంగా ప్రాసెస్ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వీడియో సందేశం ద్వారా ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వీసాల ప్రాసెస్ త్వ‌రిత‌గ‌తిన చేప‌ట్టేందుకు గాను అద‌న‌పు సిబ్బంది కూడా ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని తెలిపారు.

ప్ర‌త్యేకించి విద్యార్థుల కోసం మ‌రింత కృషి చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌త్యేకించి స్కిల్డ్ లేబ‌ర్ కోసం అన్వేషిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు అలెక్స్ ఎల్లిస్. కేవ‌లం 15 రోజుల్లోనే వీసాలు జారీ చేసేలా(UK Visa Process) ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలిపారు.

కాగా బ్రిటిష్ హై క‌మిష‌న‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై నెటిజ‌న్లు వెంట‌నే స్పందించారు. మ‌రికొంద‌రు త‌మ‌కు ఇంకా వీసాలు రావ‌డం లేద‌ని , వెంట‌నే ప్రాసెస్ ప్రారంభించాల‌ని కోరారు.

ఎంత త్వ‌ర‌గా ఫోక‌స్ పెడితే అంత మంచిదంటూ మ‌రికొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

Also Read : కొత్త ఎయిర్ బేస్ దేశ భ‌ద్ర‌త‌కు కీల‌కం – మోదీ

Leave A Reply

Your Email Id will not be published!