Jairam Ramesh : రాహుల్ గాంధీ ముంద‌స్తు ప్ర‌క‌ట‌న స‌బ‌బే

స్ప‌ష్టం చేసిన జై రామ్ ర‌మేష్

Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేను వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్ర‌క‌ట‌న చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌కుండానే పార్టీ మాజీ చీఫ్ ఎలా ప్ర‌క‌టిస్తారంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కొన‌సాగుతోంది.

పాద‌యాత్ర సంద‌ర్భంగా ఏఐసీసీ చీఫ్ ఎన్నిక‌పై ఖ‌ర్గేకు అభినంద‌న‌లు చెప్పారు రాహుల్ గాంధీ. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. ఇక బ‌రిలో ఉన్న తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గేకు 7,978 ఓట్లు రాగా శ‌శిథ‌రూర్ కు 1,072 ఓట్లు పోల్ అయ్యాయి.

ఇదిలా ఉండ‌గా పార్టీపై, రాహుల్ గాంధీపై విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌డంతో దిద్దుబాటు ప్ర‌య‌త్నం చేశారు కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్ . ఫ‌లితాల‌కు ముందే రాహుల్ కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గేను ప్ర‌క‌టించ‌డంపై వివ‌ర‌ణ ఇచ్చారు. కొత్త అధ్య‌క్షుడిగా ఖ‌ర్గేను ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ నేత స‌మ‌ర్థించారు.

ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పాద‌యాత్ర‌లో ఉన్న రాహుల్ గాంధీకి పోలింగ్ స‌ర‌ళిపై స‌మాచారం ఉంది. అత్య‌ధిక ఓట్ల‌తో ముందంజ‌లో ఉన్నారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఆయ‌న ప్రెస్ మీట్ లో ఇదే విష‌యంపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తోనే ముంద‌స్తుగా ఖ‌ర్గేకు కంగ్రాట్స్ తెలిపార‌ని ఇందులో ఎలాంటి దురుద్దేశం లేద‌ని పేర్కొన్నారు జైరాం ర‌మేష్(Jairam Ramesh).

ఇదిలా ఉండ‌గా పార్టీలో త‌న పాత్ర‌పై అడిగిన ప్ర‌శ్న‌కు రాహుల్ గాంధీ స‌మాధానం ఇస్తూ నా పాత్ర ఏమిటో కొత్త అధ్య‌క్షుడు నిర్ణ‌యిస్తాడు. ఖ‌ర్గే , సోనియా గాంధీ నిర్ణ‌యిస్తార‌ని చెప్పారు.

Also Read : భారీ వ‌ర్షం బెంగళూరు అస్త‌వ్య‌స్తం

Leave A Reply

Your Email Id will not be published!