Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీపై సోనియా గాంధీ ఎఫెక్ట్
తాత్కాలిక చీఫ్ కు మేడం రాం రాం
Sonia Gandhi : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 24 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకు ఎంతో మంది ఉన్నప్పటికీ ఇటీవలి కాలం వరకు సోనియా గాంధీ(Sonia Gandhi) ప్రభావం పార్టీపై పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ప్రభావం చూపుతూనే వస్తున్నారు.
ఇప్పటికీ పార్టీకి సంబంధించి అధ్యక్షుడి ఎంపికలో కూడా మేడం కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎప్పటికీ సోనియా గాంధీ గౌరవానికి ఢోకా ఉండదంటున్నారు ఆ పార్టీకి చెందిన అశ్వనీ కుమార్. ఆమె ఏది చెబితే అదే శిరోధార్యం. తనకు ఎదురు చెప్పే వారు ఎవరూ లేరు ఇప్పటి దాకా. రేపు కూడా ఉండబోరు కూడా. ఎందుకంటే ఆమె ఎక్కడా ఎవరిపై నోరు పారేసుకున్న దాఖలాలు లేవు.
అడపా దడపా జోక్యం చేసుకోవడం తప్ప. దేశ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న తెలంగాణ ఉద్యమాన్ని ఆమె గుర్తించారు. ఆపై తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని అనుకున్నా ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపారు. తనను విమర్శించిన వాళ్లను క్షమించిన అరుదైన నాయకురాలు సోనియా గాంధీ. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చివరకు మౌనాన్ని ఆశ్రయించారు.
కానీ ఎవరినీ కించ పర్చడం కానీ లేదా దిగజారి ఆరోపణలు చేయడం కానీ చేయలేదు. సమస్యలపై ప్రశ్నించారే తప్పా ఎక్కడా గీత దాటినట్లు దాఖలాలు లేవు. చివరకు పార్టీని వీడిన కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ సైతం సోనియా గాంధీని పల్లెత్తు మాట అనలేదు.
ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఆమె ఒక ఐకాన్ గా నిలిచి పోతారని చెప్పడంలో సందేహం లేదు.
Also Read : రాహుల్ గాంధీ ముందస్తు ప్రకటన సబబే