PM Modi : దీపావళికి మోదీ బంపర్ ఆఫర్
యువతకు 75 వేల జాబ్స్ ప్రకటన
PM Modi : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఆయన ప్రతి ఏటా దీపావళి పండుగ సందర్భంగా యూపీలోని అయోధ్యను సందర్శించడం అలవాటు. ఈ సందర్భంగా ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది.
ఇందులో భాగంగా ఇప్పటికే ప్రధానమంత్రి గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో 10 లక్షల జాబ్స్ కల్పిస్తామని ప్రకటించారు. కానీ నేటి వరకు ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం జాబ్స్ భర్తీని చేసిన దాఖలాలు లేవు. దీనిని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ.
ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్రకు విపరీతమైన జనాదరణ లభిస్తోంది. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ వరుణ్ గాంధీ సైతం తమ అధికార పార్టీపై నిప్పులు చెరుగుతూ వస్తున్నారు. పదే పదే ఆయన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం గురించి ప్రశ్నిస్తున్నారు.
దీనిని హైలెట్ చేశారు ఆ మధ్యన ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi). దీంతో తనను నిశితంగా విమర్శిస్తూ వస్తున్న ప్రతిపక్షాలకు సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు గాను 75,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన చేయనున్నారు అయోధ్య వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
దేశమంతటా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రక్షణ మంత్రిత్వ శాఖ, రైల్వే, పోస్టల్ , కార్మిక, ఉపాధి , సీఆర్ఎఫ్, సీబీఐ , కస్టమ్స్ , బ్యాంకింగ్ రంగాలలో వీటిని కేటాయించనున్నారు.
Also Read : 15 రోజుల్లో యుకె వీసా – హై కమిషనర్