Mayawati Kharge : దళితుల ఓట్ల కోసమే ఖర్గేకు ఛాన్స్
కాంగ్రెస్ పార్టీపై బీఎస్పీ చీఫ్ కామెంట్స్
Mayawati Kharge : బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్, మాజీ సీఎం మాయవతి(Mayawati) షాకింగ్ కామెంట్స్ చేశారు. 137 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మల్లికార్జున్ ఖర్గే. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గాంధీ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఇప్పటికే ముద్ర పడ్డారు.
తన సమీప ప్రత్యర్థి శశి థరూర్ పై ఘన విజయం సాధించారు. కాగా కాంగ్రెస్ పార్టీకి ఎవరు అధ్యక్షుడైనా గాంధీ ఫ్యామిలీ చేతిలో కీలుబొమ్మేనంటూ భారతీయ జనతా పార్టీ కామెంట్స్ చేసింది. దీనిని తీవ్రంగా ఖండించారు ఖర్గే. తాను కింది స్థాయి నుంచి కేంద్ర మంత్రి, పార్టీ చీఫ్ గా ఎదిగానని ఇదంతా కష్ట పడడం వల్ల వచ్చిందన్నారు.
బీజేపీ కావాలని నిరాధారమైన ఆరోపణలు చేస్తోందన్నారు. పార్టీ చీఫ్ గా ఎన్నికయ్యాక తన నిర్ణయాలే ఫైనల్ అవుతాయని చెప్పారు. కాగా సలాహాలు, సూచనలు తీసుకోవడంలో తప్పేమీ లేదన్నారు ఖర్గే(Kharge). దీనిపై తీవ్రంగా స్పందించారు మాయావతి. కాంగ్రెస్ పార్టీకి మోసం చేయడం తప్ప ఇంకేమీ తెలియదన్నారు.
ఇన్నేళ్ల కాలంలో ఆ పార్టీ దళితులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అందుకే పార్టీకి బిగ్ ఓటు బ్యాంకు కలిగిన దళితులు దూరమయ్యారని ఆ విషయం గుర్తించిన పార్టీ దళితుడైన ఖర్గేకు ఛాన్స్ ఇచ్చిందని ఆరోపించారు. ఇదంతా రాబోయే ఎన్నికల కోసం తప్ప మరొకటి కాదన్నారు మాయావతి. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు బీఎస్పీ చీఫ్.
Also Read : రాహుల్ గాంధీ ముందస్తు ప్రకటన సబబే