Amit Malviya : అమిత్ మాల్వియా షాకింగ్ కామెంట్స్

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిగ్గింగ్

Amit Malviya : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా(Amit Malviya) షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ చీఫ్ ఎన్నిక‌లు స‌జావుగా జ‌ర‌గ‌లేద‌న్నారు. విచిత్రం ఏమిటంటే ఆ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ ఇక్క‌డ ఎన్నికలో ఎవ‌రు గెలిచారో ప్ర‌క‌టించకుండానే మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే పేరు చెప్పార‌ని ఆరోపించారు.

విచిత్రం ఏమిటంటే సాక్షాత్తు అధ్య‌క్ష ఎన్నిక రేసులో ఉన్న తిరువనంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్(Shashi Tharoor) సైతం ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అమిత్ మాల్వియా చేసిన ఆరోప‌ణ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. త‌మ పార్టీలో డెమొక్ర‌సీ ఉందంటూ చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇలా చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు అమిత్ మాల్వియా.

ఇదిలా ఉండ‌గా 24 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ద‌ళితుడు, గాంధీయేత‌ర వ్య‌క్తి కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఎన్నిక‌మ్యారు. ఖ‌ర్గేకు 7,897 ఓట్లు రాగా శ‌శి థ‌రూర్ కు 1,072 ఓట్ల వ‌చ్చాయి. 2000లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో సోనియా గాంధీకి 7,448 ఓట్లు రాగా జితేంద్ర ప్ర‌సాదకు 94 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

ఇక శ‌ర‌ద్ పవ‌ర్ , రాజేశ్ పైలట్ ల‌పై సీతారాం కేస‌రి 6,224 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తంగా బీజేపీ నాయ‌కుడు అమిత్ మాల్వియా చేసిన కామెంట్స్ ఇపుడు కాంగ్రెస్ పార్టీలో కాకా రేపుతున్నాయి. క‌ల‌క‌లం సృష్టిస్తున్నాయి.

త‌మ పార్టీలో ఎన్నిక‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎలా విమ‌ర్శిస్తుంద‌ని ప్ర‌శ్నించారు మాల్వియా.

Also Read : ద‌ళితుల ఓట్ల కోస‌మే ఖ‌ర్గేకు ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!