Madhusudan Mistry : పార్టీ ముందు ఒకలా బయట మరోలా
శశి థరూర్ పై మధుసూదన్ మిస్త్రీ
Madhusudan Mistry : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ముగిసినా ఇంకా వివాదాలు సమసి పోవడం లేదు. ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఎన్నికల అధికారిగా ఉన్న మధుసూదన్ మిస్త్రీ మల్లికార్జున్ ఖర్గే గెలుపొందినట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఓట్లు లెక్కింపు సమయంలో శశి థరూర్ రిగ్గింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఈ మేరకు గురువారం మధుసూదన్ మిస్త్రీ(Madhusudan Mistry) మీడియాతో మాట్లాడారు. శశి థరూర్ పార్టీ ముందు ఒకలా బయట మరోలా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఇది పార్టీకి ప్రత్యేకించి ఎంతో అనుభవం కలిగిన ఎంపీకి మంచి పద్దతి కాదని సూచించారు. పూర్తి పారదర్శకతతో ఎన్నికలు చేపట్టడం జరిగిందన్నారు.
మొత్తం 9,900 మందికి గుర్తింపు కార్డులు జారీ చేయడం జరిగిందని చెప్పారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు. శశి థరూర్ బృందం నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదని సూచించారు మిస్త్రీ. తనకు లేఖ రాయడాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎక్కడ పొరపాట్లు జరిగాయో ఆధారాలు వుంటే తెలియ చేయాలని కోరారు. ఇలాంటి విమర్శల వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా అంతర్గతంగా తాము రాసిన లేఖ బయటకు పొక్కడంపై సారీ చెప్పారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల వివాదం ఇప్పట్లో సమిసి పోయేలా లేనట్టుంది.
మీరు చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్నాం. కానీ దానిని పట్టించు కోకుండా మీపై కుట్ర జరిగిందని ఆరోపిస్తూ మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు మిస్త్రీ.
Also Read : అమిత్ మాల్వియా షాకింగ్ కామెంట్స్