MMTC Case ED : రూ. 151.06 కోట్ల నగలు..నగదు స్వాధీనం
హైదరాబాద్, విజయవాడలో ఈడీ దూకుడు
MMTC Case ED : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా దాడులు ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్ కు చెందిన రెండు జెమ్స్ అండ్ జువెల్స్ గ్రూప్ లపై సోదాలు చేపట్టింది. ఏకంగా రూ. 149.10 కోట్ల విలువైన ఆభరణాల నిల్వలను జప్తు చేసింది.
ఇదే సమయంలో 1.96 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ఈడీ అధికారికంగా ప్రకటించింది. మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) మోసానికి సంబంధించి మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ(MMTC Case ED) ఈ దాడులు చేపట్టింది.
ఎంబీఎస్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ , ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన డైరెక్టర్లు సుఖేష్ గుప్తా, అనురాగ్ గుప్తా లను అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రదేశాలలో అక్టోబర్ 17న దాడులు చేపట్టారు. ఇదే సంస్థలకు సంబంధించి తెలంగాణలోని హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఐదు ప్రదేశాలలో సోదాలు జరిగినట్లు ఈడీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా ఎంబీఎస్ జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ సుఖేష్ గుప్తాను అక్టోబర్ 18న అదుపులోకి తీసుకుంది. ఆర్థిక నేరాల కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపింది. బయ్యర్ క్రెడిట్ స్కీం కింద బంగారు కడ్డీ కొనుగోలులో మోసం చేసినందుకు గాను గుప్తా, అతని సంస్థలపై సీబీఐ , ఏసీబీ కేసులు నమోదు చేశాయి.
అధికారులతో కుమ్మక్కై నష్టం పేరుతో మోసానికి పాల్పడ్డాడని ఈడీ ఆరోపించింది.
Also Read : దీపావళి సెలవు రోజు 25 కాదు 24