Shashi Tharoor : ఓడి పోయినందుకు బాధ లేదు – శశి థరూర్
తిరువనంతపురం ఎంపీ షాకింగ్ కామెంట్స్
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సందర్భంగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనపై ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ముందు ఒకలాగా మీడియా ముందు మరో లాగా శశి థరూర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ తరుణంలో శశి థరూర్ స్పందించారు. తాను ఓడి పోయినందుకు బాధ పడడం లేదన్నారు. పార్టీ పరంగా ప్రజాస్వామ్యం ఉందని నిరూపించేందుకే తాను పోటీ చేశానని స్పష్టం చేశారు శశి థరూర్(Shashi Tharoor). జీవితంలో గెలుపు ఓటములు సహజమేనని పేర్కొన్నారు. ఫలితం వచ్చాక తాను సోనియా గాంధీతో మాట్లాడానని చెప్పారు.
పార్టీలోని చాలా మంది సభ్యులు తమ వారికే మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. తనకు ఎలాంటి కలత చెందడం లేదన్నారు. ముందు నుంచీ మల్లికార్జున్ ఖర్గేకు పార్టీ మద్దతు ఇస్తోందన్నారు. ఇందులో తప్పేమీ కనిపించ లేదని పేర్కొన్నారు శశి థరూర్. తనకు వెన్ను పోటు తప్పదని అర్థమై పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ కేంద్ర మంత్రి మొహసినా కిద్వాయ్ జీవిత చరిత్ర ఆవిష్కరణలో పాల్గొని ప్రసంగించారు. ఇదిలా ఉండగా మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) తన ట్విట్టర్ అకౌంట్ లో మార్పు చేశారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ అని చేర్చారు. 24 ఏళ్ల తర్వాత మొదటిసారి గాంధీయేతర వ్యక్తి ఎన్నిక కావడం విశేషం. ఇప్పటి వరకు సోనియా గాంధీ తాత్కాలిక చీఫ్ గా ఉన్నారు.
Also Read : దళితుల ఓట్ల కోసమే ఖర్గేకు ఛాన్స్