Kiren Rijiju : బాగేశ్వ‌ర్ గుడిని సంద‌ర్శించిన రిజిజు

అస్సాంలో పేరొందిన ప్ర‌ముఖ ఆల‌యం

Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు(Kiren Rijiju) శుక్ర‌వారం అస్సాంలోని బొంగైగావ్ లో కొలువు తీరిన బాగేశ్వ‌ర్ ఆలయాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా పూజ‌లు చేశారు. ఆయ‌న‌కు ఆల‌యం వ‌ద్ద స్థానికులు స్వాగ‌తం ప‌లికారు. ఇదిలా ఉండ‌గా బాగేశ్వ‌ర్ గుడికి విశిష్ట‌మైన చ‌రిత్ర ఉంది.

దేశంలోని 51 శ‌క్తి పీఠాల‌లో బాగేశ్వ‌రి ఆల‌యం అత్యంత పురాత‌న‌మైన‌ది. ఈ ఆల‌యం చుట్టూ బిర్జోరా టీ ఎస్టేట్ , అంద‌మైన ప‌చ్చ‌ని కొండ‌లు ఉన్నాయి. హిందూ పుణ్య క్షేత్రంగా విల‌సిల్లుతోంది. బొంగైగావ్ ద‌క్షిణ భాగంలో ఉంది. ఎంతో చారిత్ర‌క ప్రాముఖ్య క‌లిగి ఉంది. ఒక తోట‌, శాశ్వ‌త ప్ర‌వాహం ద్వారా స‌ర‌స్సు కూడా కొలువు తీరి ఉంది.

ఆధ్యాత్మిక‌త‌కు, స్వ‌చ్ఛ‌మైన ప్ర‌శాంత‌త‌కు ఆల‌వాలం ఈ ఆల‌యం. పార్వ‌తి దేవి ఇక్క‌డ కొలువై ఉంద‌ని అస్సామీలు న‌మ్ముతారు. హిందూ పురాణాల ప్ర‌కారం శివుడిన శాంత ప‌రిచేందుకు విష్ణువు త‌న చ‌క్రంతో పార్వ‌తి శ‌రీరాన్ని ముక్క‌లు చేయ‌డంతో మా దుర్గా త్రిశూలం ప‌డి పోయింది.

అందుకే ఈ ప్ర‌దేశం శ‌క్తి పీఠాల‌లో ఒక‌టిగా మారింది. అస్సాం రాష్ట్రంలో ఎక్కువ‌గా సంద‌ర్శించే ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌లో బాగేశ్వ‌రి దేవాల‌యం ఒక‌టి. బాగేశ్వ‌రి కొండ‌పై పురాత‌న శివాల‌యం కూడా ఉంది. ఒక రాతి గుహ లోప‌ల ఉన్న మందిరానికి ఇరు వైపులా మ‌రో రెండు దేవాల‌యాలు ఉన్నాయి.

ఒక‌టి బాగేశ్వ‌రి దేవి ఆల‌యం కాగా మ‌రొక‌టి తార‌క్ నాథ్ ఆల‌యం. అమ్మ వారిని ద‌ర్శించు కోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు.

Also Read : కేదార్‌నాథ్ ఆల‌యంలో మోదీ పూజ‌లు

Leave A Reply

Your Email Id will not be published!