Imran Khan : ఇమ్రాన్ ఖాన్ కు ఎన్నికల సంఘం షాక్
బహుమతులు తీసుకున్నారంటూ ఆరోపణలు
Imran Khan : దేశ వ్యాప్తంగా ర్యాలీలు, సభలతో మరోసారి పవర్ లోకి రావాలని ప్రయత్నం చేస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కోలుకోలేని షాక్ తగిలింది. అధికారంలో ఉన్న సమయంలో విదేశీ నేతల నుంచి అందిన కానుకల గురించి అధికారులను తప్పు దోవ పట్టించారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా ఇమ్రాన్ ఖాన్(Imran Khan) పై అక్కడి మీడియాలో అత్యధిక శాతం కథనాలు ప్రచురిస్తూ వచ్చాయి. పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ పోరాడిన అనేక కేసుల్లో ఇది ఒకటి. రాజకీయ వ్యతిరేకతను అణిచి వేసేందుకు హక్కుల పర్యవేక్షకులు విమర్శించే లాంగ్ వైండింగ్ ప్రొసీడింగ్స్ లో చట్టసభ సభ్యులను కట్టడి చేసేందుకు పాకిస్తాన్ కోర్టులు తరచుగా ఉపయోగించబడతాయి.
కాగా ఈ కేసులో కమిషన్ ప్రకారం ఎన్నికైన వారంతా ఆస్తులన్నింటిని ప్రకటించాల్సి ఉంటుంది. తను పవర్ లో ఉన్న సమయంలో తనకు అందిన గిఫ్టుల గురించి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించ లేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఇదిలా ఉండగా ఇందుకు సంబంధించి పీటీఐ న్యాయవాది సయ్యద్ అలీ జాఫర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ఎన్నికల సంఘం కోర్టు కాదు. అందువల్ల వారు ఎవరినీ అనర్హులుగా ప్రకటించేందుకు వీలు లేదని పేర్కొన్నారు. ఖరీదైన బహుమతులు ఎవరైనా అందుకున్నా వాటిని తోషఖానాకు తరలిస్తారు. ఆనాటి మొఘల్ యుగం నుంచి వస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ , ఆయన భార్య విదేశీ పర్యటనల సందర్భంగా మిలియన్ డాలర్ల విలువైన బహుమతులు అందుకున్నారని ఆరోపిస్తూ పాకిస్తాన్ మీడియా కథనాలు ప్రచురించాయి. ఇందులో లగ్జరీ వాచీలు, ఆభరణాలు, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ లు , పెర్ఫ్యూమ్ లు ఉన్నాయి.
Also Read : లిజ్ ట్రస్ రాజీనామాతో పరేషాన్