JP Nadda : ‘ఢిల్లీ’పై బీజేపీ ఆపరేషన్ షురూ
జేపీ నడ్డా కీలక సమావేశం
JP Nadda : దేశంలో తన హవా కొనసాగిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీకి ఢిల్లీ అనేది కష్టంగా మారింది. ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బ కొట్టాలని గత ఎన్నికల్లో చాలా ప్రయత్నాలు చేసింది బీజేపీ. కానీ వర్కవుట్ కాలేదు. రెండోసారి కాంగ్రెస్, బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆప్. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది కేంద్రం.
ఈ తరుణంలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ పౌర సంస్థల ఎన్నికల సమయంలో ఎలాగైనా కాషాయ జెండా ఎగుర వేయాలని డిసైడ్ అయ్యారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda). ఇప్పటికే ఆపరేషన్ ప్రారంభించింది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ కోర్ గ్రూప్ తో సమావేశమయ్యారు.
ఈ మేరకు కీలక మీటింగ్ చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల కోసం పార్టీ వ్యూహంపై చర్చించారు. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిచాలి, అభ్యర్థులను ఎవరిని ఎంపిక చేయాలి, ఎన్నికల సమయంలో పార్టీ లేవనెత్తే అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఎంసీడీ వార్డు డీలిమిటేషన్ తర్వాత లాభాలు, నష్టాల గురించి మీటింగ్ లో చర్చించబడ్డాయి. వార్డుల రీడ్రాయింగ్ కు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దేశ రాజధానిలో మొత్తం పౌర సంస్థల ఎన్నికల వార్డుల సంఖ్య 272 నుండి 250కి తగ్గింది. ఇందులో 42 స్థానాలను రిజర్వ్ చేయనున్నారు.
Also Read : పుణ్య స్థలాలను నిర్లక్ష్యం చేశారు – మోదీ