Rohit Sharma : పాకిస్తాన్ జ‌ట్టు బ‌లంగా ఉంది – రోహిత్ శ‌ర్మ

టీమిండియా కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

Rohit Sharma : దాయాదుల మ‌ధ్య మరోసారి పోరాటానికి సిద్ద‌మ‌య్యాయి భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు. ఆస్ట్రేలియా వేదిక‌గా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే సూప‌ర్ -12కు చేరుకున్న భార‌త్ ప్ర‌స్తుతం ప్రారంభ మ్యాచ్ చిర‌కాల ప్ర‌త్య‌ర్థి అయిన పాకిస్తాన్ జ‌ట్టుతో త‌ల‌ప‌డ‌నుంది.

అక్టోబ‌ర్ 23న ఆదివారం కీల‌క మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇరు జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. ప్రారంభ మ్యాచ్ కంటే ముందు శ‌నివారం భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma)  మీడియాతో మాట్లాడారు.

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ప్ర‌త్య‌ర్థి పాకిస్తాన్ ను త‌క్కువ‌గా అంచ‌నా వేసేందుకు వీలు లేద‌న్నాడు. ఆ జ‌ట్టు అన్ని రంగాల‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంద‌న్నాడు. బ‌య‌ట కొన‌సాగుతున్నంత ఉద్రిక్త‌త లోప‌ట ఏమీ ఉండ‌ద‌న్నాడు. భావోద్వేగాల‌ను ఆస‌రాగా చేసుకుని తాము ఆట ఆడ‌మ‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఆట‌పైనే ఫోక‌స్ పెడ‌తార‌ని వారి మ‌ధ్య విభేదాలు అంటూ ఉండ‌వ‌న్నాడు. ఇప్ప‌టికే బీసీసీఐ వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ లో జ‌రిగే 2023 ఆసియా క‌ప్ లో పాల్గొన బోదంటూ ప్ర‌క‌టించింది. దీంతో ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ కొన‌సాగుతుందా లేదా అన్న అనుమానం వ్య‌క్తమైంది.

త‌ట‌స్థ వేదిక‌ల‌పై ఆడేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని పేర్కొంది బీసీసీఐ. ఈ త‌రుణంలో రోహిత్ శ‌ర్మ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాడే పేడో తేల్చుకుంటామ‌ని పేర్కొన్నాడు.

Also Read : టీమిండియా గెల‌వ‌డం క‌ష్టం – సెహ్వాగ్

Leave A Reply

Your Email Id will not be published!