UK PM Race : రిషి సున‌క్ ముందంజ ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

బ్రిట‌న్ పీఎం రేసులో ముగ్గురు మ‌ధ్య పోటీ

UK PM Race : బ్రిట‌న్ లో రాజ‌కీయ సంక్షోభం కంటిన్యూగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధానమంత్రిగా ఉన్న లిజ్ ట్ర‌స్ తాను ఇక ఉండ‌లేనంటూ చేతులెత్తేసింది. త‌న పీఎం ప‌ద‌వికి రాజీనామా చేసింది. ఈ త‌రుణంలో కొత్త‌గా ప్ర‌ధాన‌మంత్రిగా ఎవ‌రు కొలువు తీర‌నున్నార‌నేది ఉత్కంఠ రేపుతోంది.

మ‌రో వైపు పాల‌నా ప‌రంగా విఫ‌ల‌మైన అధికార పార్టీ వెంట‌నే ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేయాల‌ని, ఎన్నిక‌లు చేప‌ట్టాల‌ని ప్ర‌తిప‌క్షాలు కోరుతున్నాయి. బ‌రిలో మొన్న‌టి దాకా పోటీ చేసి ఓట‌మి పాలైన ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సున‌క్ తో పాటు పెన్నీ..మాజీ పీఎం బోరిస్ జాన్స‌న్(UK PM Race) ఉన్నారు.

పోటీ నుంచి తప్పుకోవాలంటూ సున‌క్ ను జాన్స‌న్ కోరిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఎలా ఎన్నుకుంటార‌నేది చ‌ర్చ జ‌రుగుతోంది. పాల‌క క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి కొత్త నాయ‌కుడిని ఎన్నుకోవాలంటే మొద‌టి ద‌శ లో 100 మంది ఎంపీల మ‌ద్ద‌తు పొందాల్సి ఉంటుంది. మొత్తం అధికార పార్టీకి 357 మంది స‌భ్యులు ఉన్నారు. రిషి సున‌క్ కు 122 మంది మ‌ద్ద‌తు ల‌భించింది.

బోరిస్ జాన్సన్ కు కూడా 100 మందిని దాటిన‌ట్లు టాక్. ఆయ‌న‌కు మ‌ద్ద‌తు దారులు 53 మంది ఉన్నారు. పెన్నీ మోర్డాంట్ కూడా రేసులో ఉండ‌డం కీల‌కంగా మారింది. సోష‌ల్ మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. సున‌క్, జాన్స‌న్ కంటే ఆమె ముందంజ‌లో ఉన్నారు.

పెన్నీ ది రియ‌ల్ మీ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండ‌గా లిజ్ ట్ర‌స్ ప్ర‌ధాన‌మంత్రిగా కేవ‌లం 45 రోజులు మాత్ర‌మే ఉంది. ఎవ‌రిని ఎంపిక చేయాల‌నే దానిపై నామినేష‌న్లు స్వీక‌రించేందుకు అక్టోబ‌ర్ 24న డెడ్ లైన్ విధించింది.

Also Read : పాక్ యూనివ‌ర్శిటీలో వ‌ల్గ‌ర్ డ్యాన్స్

Leave A Reply

Your Email Id will not be published!