Kamala Harris Deepavali : దీపావ‌ళి వేడుక‌ల్లో క‌మ‌లా హారీస్

వాషింగ్ట‌న్ లో పాల్గొన్న ఉపాధ్య‌క్షురాలు

Kamala Harris Deepavali : ప్ర‌పంచ వ్యాప్తంగా దీపావ‌ళి సంబురాలు జ‌రుపుకుంటున్నారు భార‌తీయులు. ప్ర‌ధానంగా ఎక్కువ శాతం అమెరికాలో నివ‌సిస్తున్నారు. వీరిలో తెలుగు వారు కూడా ఉన్నారు. ప్ర‌వాస భార‌తీయురాలైన అమెరికా దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్ ప్ర‌తి ఏటా వ‌చ్చే దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నారు.

దీపావళి ఉత్స‌వాల‌ను అమెరికా లోని ప్ర‌వాస భార‌తీయులు ఘ‌నంగా చేసుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని వాషింగ్ట‌న్ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో దేశ ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్(Kamala Harris Deepavali)  త‌న కుటుంబంతో క‌లిసి దీపావ‌ళి సంబురాల్లో పాలు పంచుకున్నారు. ఆమె స్వ‌యంగా బాణా సంచాలు కాల్చారు. దీపాల‌ను వెలిగించారు.

భార‌తీయ సంస్కృతిలో పండుగల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఉంది. ప్ర‌వాస భార‌తీయులంతా ల‌క్ష‌లాది మంది దీపావ‌ళిని జ‌రుపుకోవ‌డంలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్వ‌యంగా క‌మ‌లా హారీస్ పండుగ వేడుక‌ల్లో పాల్గొన్న విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు.

సోష‌ల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు, పోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయుల‌కు, ప్ర‌ధానంగా అమెరికాలో నివ‌సిస్తున్న ప్ర‌వాస భార‌తీయుల‌కు దీపావ‌ళి సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ తో పాటు ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారీస్.

ఉండగా వాషింగ్ట‌న్ లోని త‌న స్వంత నివాసంలో క‌మ‌లా హారీస్ దీపావ‌ళి వేడుక‌లు జ‌రుపు కోవ‌డం విశేషం.  ఈ ఏడాది అక్టోబ‌ర్ 24న దీపావ‌ళి జ‌రుపు కోనుండ‌గా భార‌త దేశంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ముంద‌స్తు వేడుక‌లు ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి.

Also Read : రిషి సున‌క్ ముందంజ ఎడ‌తెగ‌ని ఉత్కంఠ‌

Leave A Reply

Your Email Id will not be published!