Saleem Malik : బాబర్ కెప్టెన్సీ వదులుకుంటే బెటర్ – మాలిక్
మాజీ పాకిస్తాన్ క్రికెటర్ సలీం
Saleem Malik : దాయాదుల మధ్య పోరులో ఊహించని రీతిలో భారత్ చేతిలో 4 వికెట్ల తేడాతో టి20 వరల్డ్ కప్ సూపర్ -12 లీగ్ మ్యాచ్ లో ఓటమి పాలైంది పాకిస్తాన్ జట్టు. ఈ తరుణంలో జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు నిప్పులు చెరుగుతున్నారు. అత్యంత పేలవమైన నాయకత్వం కలిగి ఉండడం వల్లనే జట్టు ఓడి పోయిందన్నారు.
ఒకానొక దశలో 4 వికెట్లు కోల్పోయిన భారత జట్టు చివరి బంతి వరకు ఎలా మ్యాచ్ ను టర్న్ చేసిందన్న దానిపై ఒకసారి తిరిగి ఆలోచించు కోవాలని సూచించారు పాకిస్తాన్ మాజీ స్టార్ ప్లేయర్ సలీం మాలిక్(Saleem Malik). సాధారణంగా ఎప్పుడూ కామెంట్స్ చేయని మాలిక్ ఉన్నట్టుండి బాబర్ ఆజమ్ పై విరుచుకు పడ్డాడు.
ఎంత త్వరగా కెప్టెన్ గా తప్పుకుంటే పాకిస్తాన్ కు అంత మంచిదని సూచించాడు. ప్రస్తుతం సలీం మాలిక్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్నాడని మండిపడ్డాడు. విచిత్రం ఏమిటంటే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలను కట్టడి చేయడంలో , చివరి ఓవర్ ను మ్యానేజ్ చేయలేక పోవడంలో పూర్తిగా కెప్టెన్ గా బాబర్ ఆజమ్ విఫలం అయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సలీం మాలిక్.
భారత జట్టుతో ఆడేటప్పుడు ముందస్తు ప్లాన్ లేకుండా ఎలా ఆడతారంటూ ప్రశ్నించాడు. జట్టులో అదనపు స్పిన్నర్ ఉన్నా ఎందుకు ఉపయోగించు కోలేదని నిలదీశాడు బాబర్ ఆజమ్ ను. చివరి ఓవర్ వేసిన బౌలర్ ఎందుకు ఒత్తిడికి గురయ్యాడో తనకు అర్థం కాలేదన్నాడు. వైడ్ ఎలా వేస్తాడని కెప్టెన్ ఏం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యాడు.
Also Read : భారత్ కు పాండ్యా కాబోయే కెప్టెన్