Rishi Sunak Zelensky : యుద్ధానికి వ్య‌తిరేకం శాంతికి సుముఖం

బ్రిట‌న్ సంపూర్ణ మ‌ద్ద‌తు

Rishi Sunak Zelensky : బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రిగా కొలువు తీరిన భార‌తీయ సంత‌తికి చెందిన రిషి సున‌క్ త‌న‌దైన ముద్ర క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే కేబినెట్ ను ప్ర‌క్షాళ‌న చేశారు. ప‌లువురు మంత్రుల‌ను తొల‌గించారు. డిప్యూటీ పీఎంను నియ‌మించారు. భార‌తీయ సంత‌తికి చెందిన సుయెల్లా బ్రేవ‌ర్ మాన్ ను తిరిగి నియ‌మించారు.

దీనిపై కొంత విమ‌ర్శ‌లు ఉన్నా ప‌ట్టించు కోలేదు. జాతిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొన‌సాగుతోంద‌ని దీని నుంచి బ‌య‌ట ప‌డ‌డ‌మే త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందు కోసం దేశ ప్ర‌జ‌లు త‌మకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా ర‌ష్యా ఏక‌ప‌క్షంగా ఉక్రెయిన్ పై దాడి జ‌ర‌గ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు రిషి సున‌క్.

అమెరికాతో బ్రిట‌న్ ఎప్ప‌టి లాగే స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు పీఎం. ఇదే స‌మ‌యంలో దాడికి గురైన ఉక్రెయిన్ దేశ అధ్య‌క్షుడు జెలెన్ స్కీతో ఫోన్ లో మాట్లాడారు రిషి సున‌క్ (Rishi Sunak Zelensky). త‌మ సంపూర్ణ మ‌ద్ద‌తు త‌న‌కు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు హామీ ఇచ్చారు రిషి సున‌క్. బేష‌ర‌తుగా యుద్దం నుంచి ర‌ష్యా నిష్క్ర‌మించాల‌ని కోరారు.

యుద్దం ఎన్న‌టికీ ప్ర‌పంచానికి మంచిది కాద‌ని పేర్కొన్నారు బ్రిట‌న్ పీఎం. ఆయ‌న త‌న మొద‌టి కాల్ ను జెలెన్ స్కీకి చేశారు. ఒక ర‌కంగా ఇది అసాధార‌ణ‌మైన చ‌ర్య‌గా అభివ‌ర్ణించ‌క త‌ప్ప‌దు. మ‌రోవైపు ఇత‌ర దేశాలు భ‌గ్గుమంటుంటే రిషి సున‌క్ మాత్రం త‌న స్టాండ్ ను మార్చుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Also Read : యుఎస్ తో స్నేహం..ఉక్రెయిన్ కు స‌పోర్ట్ – సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!