Manickam Tagore : మాణిక్యం ఠాగూర్ రాజీనామా

కొత్త కార్య‌వ‌ర్గంపై ఖ‌ర్గే ఫోక‌స్

Manickam Tagore : అఖిల భార‌త కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారు మల్లికార్జున్ ఖ‌ర్గే. దీంతో దేశ వ్యాప్తంగా త‌న టీంను ఏర్పాటు చేసుకునే ప‌నిలో ప‌డ్డారు కొత్త బాస్. ఇప్ప‌టికే కొంద‌రు రాజీనామా చేసే యోచ‌న‌లో ఉండ‌గా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్ చార్జ్ గా ఉన్న మాణిక్యం ఠాగూరు(Manickam Tagore) బుధ‌వారం త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తాజాగా జ‌రిగిన అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఎంపీ శ‌శి థ‌రూర్ పై భారీ తేడాతో విజ‌యాన్ని సాధించారు. మాణిక్యం ఠాగూర్ త‌న రాజీనామా ప‌త్రాన్ని ఏఐసీసీ చీఫ్ కు పంపించారు. ఇదిలా ఉండ‌గా దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు స‌మ‌ర్పించారు ఏఐసీసీ చీఫ్ కు.

ఇదిలా ఉండ‌గా కొత్త టీమ్ ను త్వ‌ర‌లో ఎన్నుకోనున్నారు. దీనికి సంబంధించి కొత్త వారిని ఎంపిక చేసే ప‌నిలో బిజీగా నిమ‌గ్నం అయ్యారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. స‌మీక‌ర‌ణాలు మార‌నున్నాయి. ఇదిలా ఉండ‌గా ఖ‌ర్గే త‌న స‌మీప ఎంపీ శ‌శి థరూర్ పై 6,000 ఓట్ల‌కు పైగా తేడాతో గెలుపొందారు.

విచిత్రం ఏమిటంటే శ‌శి థ‌రూర్ 1,068 ఓట్లు సాధించ‌డం విశేషం. ఒక ర‌కంగా సోనియా గాంధీకి అనుంగు అనుచ‌రుడిగా గుర్తింపు పొందారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఇదిలా ఉండ‌గా శ‌శి థ‌రూర్ కు రాజీవ్ గాంధీతో స‌త్ సంబంధాలు క‌లిగి ఉన్నారు. ఆయ‌న రాయ‌బారిగా కూడా ప‌ని చేశారు.

Also Read : ఓట‌ర్ల‌కు టీఆర్ఎస్ డ‌బ్బుల‌తో ఎర – రాజేంద‌ర్

Leave A Reply

Your Email Id will not be published!