Rajnath Singh : డ‌ర్టీ బాంబు ప్ర‌యోగంపై రాజ్ నాథ్ ఆరా

ఉక్రెయిన్ పై ర‌ష్యా సంచ‌ల‌న ఆరోప‌ణ

Rajnath Singh : ర‌ష్యా ఉక్రెయిన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. డ‌ర్టీ బాంబు ప్ర‌యోగించిందంటూ ఆరోపించింది. కీవ్ లో ఆ బాంబు ఉన్న‌ట్లు పేర్కొంది. అణుధార్మిక‌త క‌లిగిన డ‌ర్టీ బాంబును రూపొందిస్తున్న‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉందంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో యావ‌త్ ప్ర‌పంచ‌మంతా ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి లోనైంది.

ర‌ష్యా గ‌త కొంత కాలం నుంచీ ఉక్రెయిన్ పై దాడుల ప‌రంప‌ర కొన‌సాగిస్తూ వ‌స్తోంది. ఇదే క్ర‌మంలో ర‌ష్యా చీఫ్ పుతిన్ అవ‌స‌ర‌మైతే తాము బాంబులు ప్ర‌యోగించేందుకు వెనుకాడ‌బోమంటూ హెచ్చ‌రించారు. ఇప్ప‌టికే ఆయుధాల‌తో దాడులు కొన‌సాగిస్తూనే ఉన్నారు. యావ‌త్ ప్ర‌పంచం నెత్తీ నోరు బాదుకున్నా ప‌ట్టించు కోవ‌డం లేదు.

ఈ త‌రుణంలో భార‌త ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) డ‌ర్టీ బాంబ్ క‌ల‌క‌లంపై క్లారిటీ తీసుకునేందుకు ర‌ష్యా ర‌క్ష‌ణ శాఖ మంత్రి సెర్గీ షోగూ తో బుధ‌వారం మాట్లాడారు. కావాలానే ఉక్రెయిన్ త‌మ‌ను రెచ్చ గొడుతోందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండ‌గా ర‌ష్యా ముంద‌స్తుగా ఇలాంటి ప్లాన్ చేస్తోందంటూ నాటో దేశాలు ఆరోపించాయి.

ర‌ష్యానే కావాల‌ని అబ‌ద్దాలు ఆడుతోంద‌ని డ‌ర్టీ బాంబును ఉక్రెయిన్ పై ప్ర‌యోగించాల‌ని కుట్ర‌లు ప‌న్నుతోందంటూ మండిప‌డ్డాయి. ఇదిలా ఉండ‌గా బ్రిట‌న్ పీఎంగా కొలువు తీరిన రిషి సున‌క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఉక్రెయిన్ కు త‌మ మ‌ద్ద‌తు కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా రాజ్ నాథ్ సింగ్ ర‌ష్యాతో మాట్లాడుతూ అణ్వాయుధాల‌ను ఇరు దేశాలు వాడ కూడ‌ద‌ని అది ప్ర‌పంచానికి ప్ర‌మాద‌ని హెచ్చ‌రించారు. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు.

Also Read : జై శంక‌ర్ ప‌నితీరుకు యూఏఈ మంత్రి ఫిదా

Leave A Reply

Your Email Id will not be published!