Rajeev Chandrasekhar : మ‌స్క్ అయితే ఏంటి రూల్స్ మార‌వు

కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్

Rajeev Chandrasekhar : ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపుల‌ర్ మైక్రో బ్లాగింగ్ సంస్థ‌గా పేరొందిన ట్విట్ట‌ర్ ను ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త , టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్ స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌వాస భార‌తీయుడైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ ప‌రాగ్ అగ‌ర్వాల్, చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ సెగ‌ల్ , లీగ‌ల్ హెడ్ విజ‌య గ‌ద్దె ను సాగ‌నంపారు మ‌స్క్. టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ తో డీల్ కొనుగోలు ప్రారంభించిన్ప‌టి నుంచి స్వాధీనం చేసుకునేంత దాకా ఉన్న‌త స్థాయిలో ఉన్న వారంద‌రితో గిల్లిక‌జ్జాలు పెట్టుకున్నారు.

శుక్ర‌వారం వీరింద‌ర‌ని సాగ‌నంపారు. ప్ర‌త్యేకించి అత్యంత సెక్యూరిటీతో వారంద‌రిని సాగ‌నంపారు. ఈ సంద‌ర్భంగా అత్యంత ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి ట్విట్ట‌ర్ లో. చాలా మంది ఉద్యోగులు సైతం ట్విట్ట‌ర్ ను వీడారు. ఈ త‌రుణంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ స్పందించారు.

శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ వంటి వ్య‌క్తుల‌కు ట్విట్ట‌ర్ పై నిషేధం గురించి ప్ర‌భుత్వం ఏమ‌ని అనుకుంటోందంటూ ప్ర‌శ్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajeev Chandrasekhar). త‌మ దేశానికి ఐటీ పాల‌సీ ఉంది.

ఎలోన్ మ‌స్క్ అయినా లేదా ఇంకెవ‌రైనా స‌రే త‌మ రూల్స్ పాటించాల్సిందేనంటూ స్ప‌ష్టం చేశారు. దేశంలో కొత్త‌గా స‌వ‌రించిన ఐటీ రూల్స్ ను త్వ‌ర‌లో విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు ఐటీ శాఖ మంత్రి.

44 బిలియ‌న్ డాల‌ర్లు కొనుగోలు చేసినంత మాత్రాన ఎలాన్ మ‌స్క్ కు అనుగుణంగా రూల్స్ మార్చ బోమంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Also Read : భారీ భ‌ద్ర‌త మ‌ధ్య ప‌రాగ్..సెగ‌ల్ అవుట్

Leave A Reply

Your Email Id will not be published!