KCR PK : మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ఐప్యాక్ టీమ్

అదంతా అబ‌ద్దం టీఆర్ఎస్ కు ప్ర‌చారం నిజం

KCR PK : సీఎం కేసీఆర్ ను ఆయ‌న పార్టీని తిరిగి మూడోసారి తెలంగాణ‌లో అధికారంలోకి తీసుకు రావాల‌నే దానిపై ఫుల్ క‌స‌ర‌త్తు చేస్తున్నారు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్. పైకి ప్ర‌చారం చేయ‌డం లేద‌ని చెప్పినా టీఆర్ఎస్ కోసం అంత‌ర్గ‌తంగా పీకే టీం విస్తృతంగా ప‌ని చేస్తోంది.

ఐ ప్యాక్ – ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ క‌మిటీ నుండి 60 మందికి పైగా నిపుణులు టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం 60 మందికి పైగా నిపుణులు ప‌ని చేస్తున్నారు. వీరంతా మునుగోడులో గులాబీ పార్టీని ఎలా విజ‌యం సాధించాల‌నే దానిపై ఫోక‌స్ పెడుతున్నారు. ఎక్క‌డ ప్ల‌స్ ఉంది. ఇంకెక్క‌డ మైన‌స్ ఉంది.

ఎలా ప్ర‌ధాన పార్టీల‌ను ఎదుర్కోవాలి అనే దానిపై విస్తృతంగా ఫోక‌స్ పెట్టారు ఐప్యాక్ టీం. వీరంతా డే టు డే రిపోర్ట్ ఇస్తూ అల‌ర్ట్ చేస్తున్నారు. ఉప ఎన్నిక కంటే ముందే సీఎం కేసీఆర్ తో ఒప్పందం పెట్టుకున్నారు ఐప్యాక్ చీఫ్ ప్ర‌శాంత్ కిషోర్(KCR PK). గ‌త ఏడాది ఐప్యాక్ నుంచి విడిచి పెట్టిన పీకే సీఎం తో క‌లిసి ప‌ని చేస్తోంది.

ఊహాగానాకు స్వ‌స్థి ప‌లుకుతూ న‌వంబ‌ర్ 3న జ‌రిగే మ‌నుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో ఫోక‌స్ పెట్టింద‌ని స‌మాచారం. ఐపాక్ – టీఆర్ఎస్ స‌మ‌న్వ‌యం గురించి ఊహాగానాలు ప్రారంభ‌మైన వెంట‌నే సీఎం పార్టీ జాతీయ స్థాయిలోకి ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేసీఆర్. అక్టోబ‌ర్ 5న భార‌త రాష్ట్ర స‌మితిని ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు కేసీఆర్.

Also Read : ద‌మ్ముంటే సీబీఐతో విచార‌ణ చేప‌ట్టండి

Leave A Reply

Your Email Id will not be published!