Azam Khan : ఆజం ఖాన్ ఎమ్మెల్యేగా అనర్హుడు – స్పీకర్
రాంపూర్ స్థానం ఖాళీగా ఉందని ప్రకటన
Azam Khan : సమాజ్ వాది పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్న ఆజం ఖాన్(Azam Khan) కు కోలుకోలేని షాక్ తగిలింది. ద్వేష పూరిత ప్రసంగాలకు పాల్పడినందుకు కోర్టు ఆయనకు మూడు ఏళ్ల జైలు శిక్ష , జరిమానా విధించింది. ఆయనకు 74 ఏళ్లు. యూపీలోని రాంపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తాజాగా యూపీ స్పీకర్ సంచలన ప్రకటన చేశారు. ఆజం ఖాన్ ఎమ్మెల్యేగా అనర్హుడంటూ ప్రకటించారు. ఇక్కడ స్థానం ఖాళీగా ఉందని వెల్లడించింది.
దీంతో సమాజ్ వాది పార్టీలో కలకలం రేపింది ఈ నిర్ణయం. ఇదిలా ఉండగా 2013 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ లేదా క్రిమినల్ కేసులో దోషిగా తేలి కనీసం రండు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడి అతడు లేదా ఆమె సభ్యత్వాన్ని కోల్పోతారు.
ఆయనను అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. 2019లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ పై వ్యతిరేకంగా విద్వేష పూరిత ప్రసంగం చేసినందుకు గాను మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ఎమ్మెల్యే పదవిని కోల్పోయాడని స్పీకర్ ప్రకటించారు.
ఆయన సీటు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించడంతో అనర్హత వేటు పడింది. ఆజం ఖాన్ 2019 లోక్ సభ ఎన్నికల్లో రాంపూర్ నుండి గెలుపొందారు.2022లో యూపీ రాష్ట్ర ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యాక ఎంపీ స్థానాన్ని కోల్పోయాడు. జైలు లో నుండే విజయం సాధించాడు.
కాగా ద్వేష పూరిత ప్రసంగం నేరారోపణ తర్వాత ఆజం ఖాన్ కు బెయిల్ మంజూరైంది. శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ చేసేందుకు ఒక వారం సమయం ఇచ్చింది కోర్టు.
Also Read : మునుగోడు ఉప ఎన్నికల్లో ఐప్యాక్ టీమ్