Delhi LG vs CM : కాలుష్య వ్య‌తిరేక‌ ప్ర‌చారంపై చెరో దారి

లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వ‌ర్సెస్ సీఎం

Delhi LG vs CM : దేశ రాజ‌ధానిలో పాల‌న ప‌డ‌కేసింది. నువ్వా నేనా అన్న రీతిలో ఆధిపత్య పోరు న‌డుస్తోంది లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా వ‌ర్సెస్ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్(Delhi LG vs CM) మ‌ధ్య‌. గ‌త కొంత కాలంగా ప్ర‌భుత్వాన్ని , దాని ప‌నితీరును ప్ర‌శ్నిస్తూ వ‌స్తున్నారు ఎల్జీ. ఇదంతా కేంద్రం ఆడిస్తున్న నాట‌క‌మ‌ని ఆప్ చీఫ్‌, ఢిల్లీ బాద్ షా కేజ్రీవాల్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

తాజాగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు మ‌రింత తారాస్థాయికి చేరాయి. కాలుష్యాన్ని అరిక‌ట్టేందుకు వేర్వేరుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌నం సొమ్ముతో ఎలా ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నిస్తోంది ఎల్జీని ఆప్. తాను ఎలాంటి దుబారా ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని ఘాటుగా స‌మ‌ధానం ఇచ్చారు.

ప్ర‌చార ప్రారంభ తేదీ గురించి వాస్త‌వం వెల్ల‌డించ లేద‌ని లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ను బ‌లవంతంగా నిర్ణ‌యం తీసుకునేలా చేసింద‌ని ఎల్జీ కార్యాల‌యం పేర్కొంది. మ‌రో వైపే ఇదే కాన్సెప్ట్ తో ఆప్ ప్ర‌భుత్వం కాలుష్య కార‌క వ్య‌తిరేక ప్ర‌చారానికి ఎల్జీ నుంచి ప‌ర్మిష‌న్ రాలేద‌ని అందుకే వాయిదా వేసిన‌ట్లు తెలిపింది.

ఇద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న ఆధిప‌త్య పోరు ఢిల్లీ వాసుల పాలిట శాపంగా మారింది. మ‌రో వైపు ప్ర‌చారానికి స‌కాలంలో ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క పోవ‌డం తో స‌క్సేనా జ‌వాబు ఇవ్వ‌లేక సాకులు చెబుతున్నారంటూ ఆరోపించింది ఆప్.

దేశ రాజ‌ధానిలో అరిక‌ట్టడంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడంటూ మండిప‌డ్డారు సీం అర‌వింద్ కేజ్రీవాల్. ప‌ర్మిష‌న్ కు సంబంధించిన ఫైల్ ను అక్టోబ‌ర్ 21న పంపిన‌ట్లు తెలిపింది ఆప్ స‌ర్కార్. ఇందుకు సంబంధించి ఇప్ప‌టి దాకా వివ‌ర‌ణ ఇవ్వ‌లేద‌న్నారు.

Also Read : ఇండిగో ఫ్లైట్ ఇంజ‌న్ లో మంట‌లు

Leave A Reply

Your Email Id will not be published!