Elon Musk : కంటెంట్ మోడ‌రేష‌న్ కౌన్సిల్ డిక్లేర్

ఎలోన్ మ‌స్క్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Elon Musk : 44 బిలియ‌న్ డాల‌ర్ల‌తో ట్విట్ట‌ర్ ను భారీ కొనుగోలు చేసిన టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలాన్ మ‌స్క్(Elon Musk) సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న వ‌చ్చీ రావ‌డంతోనే కోలుకోలేని షాక్ ఇచ్చారు టాప్ ఎగ్జిక్యూటివ్ ల‌కు. సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్, సీఎఫ్ఓ సెగెల్ , లీగ‌ల్ హెడ్ విజ‌యా గ‌ద్దెల‌ను సాగ‌నంపారు.

వారికి మొత్తంగా దాదాపు $100 మిలియ‌న్ డాలర్ల‌ను అప్ప‌గించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యానికి తెర తీశారు ఎలాన్ మ‌స్క్. ట్విట్ట‌ర్ కోసం కంటెంట్ మోడ‌రేష‌న్ కౌన్సిల్ ను ప్ర‌క‌టించారు. ట్విట్ట‌ర్ విభిన్న దృక్కోణాల‌తో కంటెంట్ ను క్రియేట్ చేసేందుకు ఓ నిపుణుల‌తో కూడిన క‌మిటీని ప్ర‌క‌టించారు ఎలాన్ మ‌స్క్.

అంత‌కు ముందు ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ సిఇఓ , కంపెనీ లీగ‌ల్ హెడ్ ను తొల‌గించాక ప‌క్షికి విముక్తి క‌లిగింది అంటూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ అధికారికంగా అక్టోబ‌ర్ 28న శుక్ర‌వారం ఎలోన్ మ‌స్క్ ప్రైవేట్ ఆస్తిగా మారింది. సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల‌లో టాప్ లో కొన‌సాగుతోంది ట్విట్ట‌ర్.

విస్తృత వైవిధ్య‌మైన దృక్కోణాల‌ను స్వీక‌రించే కంటెంట్ మోడ‌రేష‌న్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించాడు. ఆ కౌన్సిల్ స‌మావేశానికి ముందు ఎటువంటి ప్ర‌ధాన కంటెంట్ నిర్ణ‌యాలు లేదా ఖాతా పున‌రుద్ద‌ర‌ణ‌లు జ‌ర‌గ‌వ‌ని స్ప‌ష్టం చేశాడు ఎలాన్ మ‌స్క్(Elon Musk).

ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, బెదిరింపులు..కేసుల దాకా వెళ్లి తిరిగి ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేయ‌డం క‌థ ముగిసింది. ప‌క్షి ఉచితం అని కంపెనీ లోగోను సూచిస్తూ బిలియ‌నీర్ టెస్లా వ్య‌వ‌స్థాప‌కుడు ..అంత‌రిక్ష మార్గ‌ద‌ర్శ‌కుడు ట్వీట్ చేశారు.

Also Read : టాప్ ఎగ్జిక్యూటివ్స్ కు $100 మిలియ‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!