Pakistan Grey List : ఉగ్ర‌వాదాన్ని..మూక‌ల్ని ఏరి పారేస్తాం

భార‌త సీనియ‌ర్ అధికారి వెల్ల‌డి

Pakistan Grey List : ఫైనాన్షియ‌ల్ యాక్ష‌న్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌టీఎఫ్‌) గ్రే లిస్టులో పాకిస్తాన్ ను(Pakistan Grey List) చేర్చిన త‌ర్వాత జ‌మ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్ర దాడులు త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని భార‌త సీనియ‌ర్ అధికారి ఒక‌రు వెల్ల‌డించారు.

ఐక్య రాజ్య స‌మితి మీట్ లో భార‌త్ ఎఫ్ఏటీఎఫ్ అనేది మ‌నీ లాండ‌రింగ్ , టెర్ర‌ర్ ఫైనాన్సింగ్ , అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఇత‌ర సంబంధిత బెదిరింపుల‌ను ఎదుర్కొనేందుకు 1989లో స్థాపించ‌బ‌డిన అంత‌ర్ ప్ర‌భుత్వ సంస్థ‌. ఇదిలా ఉండ‌గా గ్రే జాబితాలో ఉండ‌గా ఉగ్ర‌వాద దాడులు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

యుఎన్ మీట్ లో భార‌త్ పాకిస్తాన్ లిస్టులో చేర్చింది. గ‌తంలో పెద్ద ఎత్తున దాడులు ముమ్మ‌రం కాగా ప్ర‌స్తుతం నరేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం కొలువు తీరాక ఉగ్ర మూక‌ల‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో భార‌త భ‌ద్ర‌తా ద‌ళాలు స‌క్సెస్ అయ్యాయి.

కానీ పెద్ద ఎత్తున ప్రాణ న‌ష్టం కూడా ఆర్మీ వైపు చోటు చేసుకుంది. ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి ఉగ్ర‌వాద నిరోధ‌క క‌మిటీ ఈ ప‌రస్ప‌ర సంబంధాన్ని ప‌రిశీలించాల‌ని సంయుక్త కార్య‌ద‌ర్శి స‌ఫీ రిజ్వీ అన్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త‌దేశం నిర్వ‌హిస్తున్న ఐక్య‌రాజ్య స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి ప్యానెల్ ప్ర‌త్యేక స‌మావేశంలో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు.

కాగా పాకిస్తాన్ పేరును ఏ స‌మ‌యంలోనూ ప్ర‌స్తావించ లేదు. పాకిస్తాన్ లో ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు కూడా పెరిగాయ‌ని తెలిపారు. జ‌మ్మూ కాశ్మీర్ లో క‌ఠిన‌మైన గ్రే లిస్టు నుంచి తొల‌గించే అవ‌కాశాలు పెరిగాయ‌ని పేర్కొన్నారు.

Also Read : టెర్ర‌రిస్ట్ టూల్ కిట్ గా సోష‌ల్ మీడియా

Leave A Reply

Your Email Id will not be published!