Geetanjali Shree : రాసేందుకు హిందీ భాష సులభమైంది
బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ
Geetanjali Shree : అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచిన గీతాంజలి శ్రీ(Geetanjali Shree) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ ప్రభుత్వం హిందీ భాషను దేశమంతటా విస్తరించాలని , అధికార భాషగా మార్చాలని ప్రయత్నం చేస్తోంది.
ఒకే పార్టీ ఒకే జాతి ఒకే మతం ఒకే దేశం ఒకే భాష అనేది దాని లక్ష్యం. ఈ తరుణంలో బుకర్ ప్రైజ్ విన్నర్ మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఏది రాయాలన్నా హిందీ భాష సులభమైనదని పేర్కొన్నారు.
ఒక రకంగా కేంద్రానికి , పీఎం మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు బూస్ట్ ఇచ్చిందని చెప్పక తప్పదు. గీతాంజలి శ్రీ రాసిన రెట్ సమాధి నవలకు బుకర్ ప్రైజ్ 2022 గెలుచుకుంది. ఆమె హిందీలో రాసిన ఈ పుస్తకాన్ని అమెరికన్ అనువాదకురాలు డైసీ రాక్ వెల్ టాంబ్ ఆఫ్ శాండ్ గా ఆంగ్లంలోకి అనువదించారు.
ఇదిలా ఉండగా అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న తొలి హిందీ రచయిత్రిగా గీతాంజలి శ్రీ(Geetanjali Shree) చరిత్ర సృష్టించారు. శుక్రవారం దుబాయ్ లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రాంతీయ పదజాలం మరింత బలంగా చెప్పేందుకు వీలు కలుగుతుందన్నారు. హిందీ నాకు సులభంగా అనిపిస్తుందన్నారు. ఈ భాష ద్వారా నన్ను నేను వ్యక్తీకరించేందుకు దోహదం చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అన్ని భాషలకు వాటికి చరిత్ర ఉందన్నారు. ఒకదానితో మరో దానిని పోల్చలేమన్నారు. ఇంగ్లీష్ అనేది ఇవాళ గ్లోబల్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ గా ఉందన్నారు.
Also Read : కాలుష్య నియంత్రణ రాష్ట్రాలదే