Munugodu Counting : మునుగోడు కౌంటింగ్ ఏర్పాట్లపై ఫోకస్
మధ్యాహ్నం లోపే ఫలితం వచ్చే ఛాన్స్
Munugodu Counting : దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నవంబర్ 7న ఆదివారం ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి ఫలితం రానుందని అంచనా. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఏర్పాట్లు చేసింది.
ఇప్పటికే ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లగొండకు తీసుకు వచ్చారు. ఓట్ల లెక్కింపునకు(Munugodu Counting) సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గెలుపు ధీమాలో ఉన్నాయి. ఇక కౌంటింగ్ కు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం అవుతుంది.
ఇందులో భాగంగా 21 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. 15 రౌండ్లు కొనసాగనుంది పోలింగ్ కౌంటింగ్. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఓట్లను లెక్కించడం ప్రారంభిస్తారు. మునుగోడులో మొత్తం 2,41,805 ఓటర్లు ఉండగా 93.5 శాతానిక పైగా పోలింగ్ జరగడం విశేషం.
కౌంటింగ్ కు సంబంధించి నల్లగొండ పట్టణంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) గోదాంలో కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్లు, పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను ఓపెన్ చేస్తారు.
ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి 686 ఓట్లను కౌంట్ చేస్తారు.ఇక కౌంటింగ్ లో భాగంగా చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల వారీగా ఓట్లు లెక్కిస్తారు.
Also Read : ఆ నలుగురికి ఫుల్ సెక్యూరిటీ